చంద్రశేఖర్ యేలేటి. మనకు వున్న మంచి దర్శకుల్లో ఒకరు. ఐతే, అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం, సాహసం, మనమంతా ఇలా వైవిధ్యమైన సినిమాలు అందిస్తూ వస్తున్న ఆయన అందిస్తున్న లేటెస్ట్ మూవీ చెక్. చదరంగం బ్యాక్ డ్రాప్ లో ఓ యువకుడి కథను డిఫరెంట్ గా తెరకెక్కిస్తున్నారు.
ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ట్రయలర్ విడుదలయింది. టెర్రరిస్ట్ గా ముద్రపడిన యువకుడు చదరంగం ట్రోఫీకి ఆడడం అన్నది కీలకమైన పాయింట్ గా, సినిమా లో అధికభాగం జైలు సెటప్ లోనే సాగినట్లు ట్రయిలర్ లో కనిపిస్తోంది.
హీరో తరపున కోర్టులో పోరాడే లాయర్ గా హీరోయిన్ రకుల్, హీరోను బలంగా ద్వేషించే అధికారిగా సంపత్ రాజ్ వున్నారు. కళ్యాణ్ మాలిక్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా ట్రయిలర్ లో డెప్త్ వున్న డైలాగులు రెండు మూడు వినిపించాయి.
ఏ యుద్దాన్నైనా మొదలుపెట్టేది సిపాయే అన్న డైలాగు యేలిటి స్టామినాను చెబ్తుంది. భవ్య బ్యానర్ మీద నిర్మించిన ఈ సినిమాకు అన్నేరవి నిర్మాణ నిర్వాహకుడు. ఈ నెల 26న థియేటర్లలోకి వస్తుందీ సినిమా.