పవన్ కళ్యాణ్ అద్భుతమైన సినిమా నటుడు. ఆయన సినిమాలు చూసే అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. రాజకీయాల్లో పవన్ జనసేన అధ్యక్షుడు. మరి పవన్ రాజకీయం ఏంటి అంటే అదంతా ఉత్త గందరగోళమని ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ సాకే శైలజానాధ్ అంటున్నారు.
పవన్ చేతిలో చెగువీరా బొమ్మ ఉంటుంది, ఆయన చేతులు కలిపేది మాత్రం మతోన్మాద బీజేపీతో అంటూ ఆయన బాగానే పంచులేశారు. పవన్ అయోమయమైన రాజకీయం చేస్తున్నారు అంటూ శైలజానాధ్ హాట్ కామెంట్స్ చేశారు.
మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఆయన వదలలేదు. చంద్రబాబు రాజకీయం పూర్తిగా అటూ ఇటూ కాకుండా ఉందంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు కేంద్రంలో బీజేపీ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రూపొందిస్తే అక్కడ వాటికి మద్దతు పలుకుతారని, ఏపీలో మాత్రం అవే చట్టాలను తప్పు పడుతూ జనాలను గందరగోళంలోకి నెడుతున్నారని సాకే అంటున్నారు.
ఈ దేశానికి కాంగ్రెస్ అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశాన్ని కాపాడుతుంది అంటూ శైలజానాధ్ అంటున్నారు. మంచిచే కానీ ప్రజలు కూడా కాంగ్రెస్ మాకు కావాలని ఆకాంక్షించాలిగా. చూడాలి మరి.