‘పొంగల్’ కు ఉత్తరాంధ్ర రెడీ

పండగ సినిమాల ప్రకటనలు వచ్చేసాయి. దాంతో తెలుగు సినిమాకు కీలకమైన వైజాగ్ (ఉత్తరాంధ్ర) ఏరియాలో థియేటర్ల హడావుడి రెడీ అయిపోయింది.  Advertisement సర్కారు వారి పాట సినిమా కోసం ఇప్పటికే యాభై థియేటర్లతో అగ్రిమెంట్…

పండగ సినిమాల ప్రకటనలు వచ్చేసాయి. దాంతో తెలుగు సినిమాకు కీలకమైన వైజాగ్ (ఉత్తరాంధ్ర) ఏరియాలో థియేటర్ల హడావుడి రెడీ అయిపోయింది. 

సర్కారు వారి పాట సినిమా కోసం ఇప్పటికే యాభై థియేటర్లతో అగ్రిమెంట్ జరిగిపోయింది. ఏటా దిల్ రాజు-శిరీష్ ముందుగా థియేటర్లు బ్లాక్ చేసి లబ్ది పొందుతూ వుండడంతో, మిగిలిన వారు ఈసారి ముందుగా జాగ్రత్త పడ్డారు.

దీంతో దిల్ రాజు కూడా తన చేతిలో వున్న థియేటర్లతో పాటు, దొరికే వేరే థియేటర్లను కూడా అగ్రిమెంట్ లు చేయించడం ప్రారంభించేసారు. 

ప్రస్తుతానికి దిల్ రాజుకు సర్కారు వారి పాట లేదు. పుష్ప కూడా ఆయనది కాదు. అయ్యప్పన్ రీమేక్ కూడా ఆయనకే వుంటుందో? వుండదో? అన్నది డవుటు. ఎఫ్ 3 విడుదల సంక్రాంతికి వుండకపోవచ్చు. ఇక మిగిలింది రాథేశ్వామ్ మాత్రమే. 

ఇప్పటికే పుష్ప ఉత్తరాంధ్ర హక్కులు 60 కోట్ల రేషియోలో 15 కోట్లకు ఇచ్చేసారు. సర్కారు వారి పాట రేటు కూడా దగ్గర దగ్గర ఇదే రేంజ్ లో వుంటుందని తెలుస్తోంది. 

అయ్యప్పన్ రీమేక్ రేట్లు ఎలా వుంటాయో ఇంకా ఫిక్స్ కాలేదు. ఆచార్య సినిమాను 60 కోట్ల రేంజ్ లో వకీల్ సాబ్ ను 45 కోట్ల రేంజ్ లో ఆంధ్రకు విక్రయించిన దగ్గర నుంచి రేట్లు భయంకరంగా పెరిగిపోయాయి. 

కానీ ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రభుత్వం రేట్లు సవరించడం, అదనపు రేట్లకు అనుమతులు ఇవ్వడం అనే వ్యవహారం మీదే ఆధారపడి వుంటాయి.