శ్రీను వైట్లను ఆదుకోడానికి రెడీ

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులిచ్చిన శ్రీనువైట్లకు మరో ఛాన్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. శ్రీనువైట్లతో సినిమా చేసేంత సాహసాన్ని పెద్ద హీరోలెవరూ చేయడం లేదు. ఇలాంటి టైమ్ లో మరోసారి వైట్లకు అవకాశం…

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులిచ్చిన శ్రీనువైట్లకు మరో ఛాన్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. శ్రీనువైట్లతో సినిమా చేసేంత సాహసాన్ని పెద్ద హీరోలెవరూ చేయడం లేదు. ఇలాంటి టైమ్ లో మరోసారి వైట్లకు అవకాశం ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు రవితేజ. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది.

శ్రీనువైట్ల-రవితేజది సూపర్ హిట్ కాంబినేషన్. వెంకీ, దుబాయ్ లాంటి హిట్ సినిమాలు వీళ్ల కాంబినేషన్ లోనివే. దుబాయ్ శీను తర్వాత రవితేజ-వైట్ల కలిసి మళ్లీ సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నేళ్లకు రవితేజను ఆశ్రయించాడు శ్రీనువైట్ల.

మిస్టర్ మూవీ డిజాస్టర్ తర్వాత లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే తక్కువ పారితోషికానికి మరో సినిమా చేసి పెడతానని నిర్మాత నల్లమలపు బుజ్జికి మాటిచ్చాడట వైట్ల. సో.. రవితేజతో సినిమా ఇదే బ్యానర్ పై ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ సినిమాలు చేస్తున్నాడు రవితేజ. వీటిలో రాజా ది గ్రేట్ సినిమా ముందుగా థియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీ విడుదల తర్వాత శ్రీనువైట్లతో సినిమాపై క్లారిటీ వస్తుంది. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ రూపంలో శ్రీనువైట్ల 3 ఫ్లాపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.