త్రివిక్రమ్ కు ఆ హీరోయిన్ తెగ నచ్చేసిందట!

హీరోయిన్ల విషయంలో త్రివిక్రమ్ చాలా సెలక్టివ్ గా ఉంటాడు. ఒకసారి తనకు నచ్చితే, ఆ భామకే మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తుంటాడు. సమంత విషయంలో ఇదే జరిగింది. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ..…

హీరోయిన్ల విషయంలో త్రివిక్రమ్ చాలా సెలక్టివ్ గా ఉంటాడు. ఒకసారి తనకు నచ్చితే, ఆ భామకే మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తుంటాడు. సమంత విషయంలో ఇదే జరిగింది. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ.. ఇలా వరుసగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించింది. ఇప్పుడు ఆ అదృష్టం అను ఎమ్మాన్యుయేల్ కు దక్కనుందట.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. ఇందులో అను ఎమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ ముద్దుగుమ్మ డెడికేషన్, యాక్టింగ్ త్రివిక్రమ్ కు బాగా నచ్చాయట. అందుకే తన నెక్ట్స్ సినిమాలో కూడా ఆమెను రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నాడట.

మజ్ను సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అను.. ఆక్సిజన్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలు చేసింది. వీటిలో ఆక్సిజన్ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు.  పవన్ సినిమాలో నటించే అవకాశం అందుకున్న ఈ బ్యూటీ.. ఆ వెంటనే బన్నీ నటిస్తున్న 'నా పేరు సూర్య'లో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. ఎన్టీఆర్ మూవీలో కూడా ఛాన్స్ దక్కితే, ఆమె కెరీర్ మరింత ఊపందుకోవడం ఖాయం.