పింక్ సినిమా లైన్, లెంగ్త్ వేరు. అమితాబ్ ఓల్డ్ గెటప్ వేరు. కేవలం పాయింట్ ను,కథను అంటిపెట్టుకుని నడిచే కథనం వేరు. ఇప్పుడు ఇది తెలుగులో వకీల్ సాబ్ అంటూ రీమేక్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తుండడంతో, సినిమా బడ్జెట్, మార్కెట్ అన్నీ మారిపోయాయి. ఎనభై కోట్ల బడ్జెట్, వంద కోట్లను దాటిన మార్కెటింగ్ ఇలా అన్నీ వచ్చి చేరాయి.
దాంతో సినిమాను ఆ అంచనాలు, ఆ మార్కెట్ కు తగినట్లు మార్చే పని ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఫైటింగ్ లు, పాటలు, హీరోయిజం, అన్నింటికి మించి పవన్ రాజకీయ ఎజెండాకు అనుగుణంగా సీన్లు బాగానే దట్టించినట్లు కనిపిస్తోంది.
ఈ సినిమా నుంచి సత్యమేవజయతే అంటూ ఓ సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటలో క్లిప్పింగ్స్, అలాగే పాట సాహిత్యం, ఇవన్నీ కలిసి వకీల్ సాబ్ ను ఓ పొలిటికల్ టచ్ లేదా పొలిటికల్ హీరోయిజం టచ్ తో తయారుచేసినట్లు కనిపిస్తోంది.
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సినిమాలు రాలేదు. వకీల్ సాబ్ ఆ లోటు తీరుస్తుందా? లేక కేవలం పవన్, ఆయన అభిమానులకు సరిపడే రేంజ్ లో వుంటుందా అన్నది చూడాలి.