రానా…ఫారెస్ట్ మూవీ

అరణ్య…చాలా రోజుల నుంచి వార్తల్లో వినిపిస్తున్న పాన్ ఇండియా సినిమా. గతంలో గజరాజు లాంటి మంచి సినిమా అందించిన ప్రభు సొలమన్ అందిస్తున్న సినిమా. Advertisement ఏనుగులను కాపాడడం అనేది సింపుల్ గా చెప్పుకునే…

అరణ్య…చాలా రోజుల నుంచి వార్తల్లో వినిపిస్తున్న పాన్ ఇండియా సినిమా. గతంలో గజరాజు లాంటి మంచి సినిమా అందించిన ప్రభు సొలమన్ అందిస్తున్న సినిమా.

ఏనుగులను కాపాడడం అనేది సింపుల్ గా చెప్పుకునే లైన్. కానీ సినిమాలో చాలా వుంది విషయం అని విడుదలైన ట్రయిలర్ చెబుతోంది. అడవికి సమీపంలో వున్న పట్టణంలో నిర్మించే టౌన్  షిప్.

దాని కోసం ఏనుగులు వెళ్లే దారిని బ్లాక్ చేస్తూ భారీ గోడ నిర్మాణం, అడవిలో నక్సల్స్, చిన్నప్పటి నుంచి ఏనుగులతో సహవాసం చేస్తూ వాటిని కాపాడడమే ధ్యేయంగా పెట్టుకున్న హీరో చాలా వుంది వ్యవహారం.

ట్రయిలర్ ను ఇంట్రస్టింగ్ గానే కట్ చేసారు.కానీ పాయింట్ కొత్తగా వుందన్నది మాత్రం చెప్పలేకపోయారు. అయితే రానా బాడీ లాంగ్వేజ్ ను డిఫరెంట్ గా డిజైన్ చేసారు. ఆ బాడీ లాంగ్వేజ్ లో రానా కొత్తగా వున్నాడు. తమిళనటుడు విష్ణు విశాల్ తో సహా అన్ని భాషలకు చెందిన తారలు ఇందులో వున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.