టాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలు అన్నీ అండర్ ప్రొడక్షన్ లో వున్నాయి. కరోనా కారణంగా టాలీవుడ్ సినిమాల షెడ్యూలు అంతా అతలాకుతలం అయిపోయింది. ఇప్పుడిప్పుడే మెలమెల్లగా అంతా సర్దుకుంటోంది. అయితే షూటింగ్ లు రెగ్యులర్ అయ్యాయి కానీ థియేటర్లు ఎప్పుడు? సినిమాల ఎప్పుడు? అన్నది సస్పెన్స్ లోనే వుంది.
ముఖ్యంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, మెగాస్టార్ ఆచార్య, బన్నీ పుష్ప , త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా ఇవన్నీ ఎప్పటికి థియేటర్లలోకి వస్తాయి అన్నది టాలీవుడ్ డిస్కషన్ పాయింట్ గా వుంది.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం వకీల్ సాబ్ సంక్రాంతి బరి నుంచి దాదాపు తప్పుకున్నట్లే. 2021 ఏప్రియల్ విడుదల దిశగా ఆ సినిమా నడుస్తోంది. నిర్మాత దిల్ రాజు ఈ మేరకు ప్లాన్ చేసుకుంటున్నారు.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ 2021 అక్టోబర్ కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పైకి జూలైకి రెడీ అయిపోతుందని చెబుతున్నారు కానీ అక్టోబర్ కే వస్తుందని తెలుస్తోంది.
పుష్ప సినిమాను ఎలాగైనా పోస్ట్ సమ్మర్ కు రెడీ చేయించాలి అన్నది అల్లు అర్జున్ ప్లాన్ గా వుంది. కానీ సుకుమార్ తో వ్యవహారం ఎప్పటికి తెములుతుందన్నది తెలియదు.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా మార్చి నుంచి సెట్ మీదకు వెళ్తుందని బోగట్టా. ఎప్పుడు సెట్ మీదకు వెళ్లినా అది విడుదల మాత్రం 2022 సంక్రాంతికే. ఈ మేరకు యూనిట్ ఫిక్స్ అయిపోయింది.
ఇవన్నీ ఇలా వుంటే పవన్ మరో సినిమా అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ వ్యవహారం ఏమిటి అన్నది ఇంకా తెలియదు. అది జనవరి నుంచి సెట్ మీదకు వెళ్తుంది. రెడీ ఎప్పటికి అవుతుంది అన్నది తెలియదు అలాగే విడుదల స్లాట్ మీద కూడా ఇంకా క్లారిటీ లేదు.