మరీ అద్భుతమైన కథలు వండి వార్చకపోయినా, రెండు మూడు సినిమాలు లేదా వచ్చేసిన పాయింట్లు కలిపి వండి వార్చి, కొత్త కథలు తయారుచేసి, హిట్ లు కొట్టడంతో, వక్కంతం వంశీ మాంచి కథకుడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. అక్కడితో ఆగకుండా డైరక్టర్ కావాలనుకున్నారు. ఆఖరికి అయ్యారు కూడా.
కానీ అక్కడే అదృష్టం మొహం చాటేసింది. నా పేరు సూర్య సినిమా బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ మంది. దాంతో తరువాత సినిమా ఏంటీ? అన్నది క్వశ్చను మార్కులా మిగిలింది. కానీ చేతిలో పనికి మాత్రం ఢోకాలేదని తెలుస్తోంది. హీరో అల్లు అర్జున్ ఇప్పుడు వక్కంతం వంశీని తన ఆస్థానంలో వుంచేసుకున్నట్లు వినికిడి.
ఇప్పటికే తివిక్రమ్ దగ్గర చిరకాలం వున్న సాయిని బన్నీ దగ్గరకు తీసాడు. స్క్రిప్ట్ లు వినడం వంటి వ్యవహారాలు అప్పగించాడు. వక్కంతం వంశీకి స్క్రిప్ట్ లు రిపేర్ చేయడం, డిస్కషన్లలో పాల్గొనడం, సరైన స్క్రిప్ట్ తయారీకి సహకరించడం లాంటి పనులు అప్పగించినట్లు తెలుస్తోంది.
విక్రమ్ కే కుమార్ స్క్రిప్ట్ విషయంలో కూడా వక్కంతం వంశీ సాయం పడుతున్నట్లు వినికిడి. మొత్తంమీద వక్కంతం వంశీకి ఎక్కడ టాలెంట్ వుందో బన్నీ బాగానే పసిగట్టి తగిన పని అప్పగించినట్లుంది.