కమెడియన్ గా దాదాపు నెంబర్ వన్ పొజిషన్ కు చేరుకుని, హీరోగా మారాడు సునీల్. అయితే హీరోగా ఒకటి రెండు హిట్ లు కొట్టినా, ఆ తరువాత మాత్రం వరుసగా పరాజయాలే చవి చూసాడు. ఆఖరికి మళ్లీ కమెడియన్ గా మారాడు. ఇప్పుడు అంతా బాగుంది. ఇటు అభిమానులకు సునీల్ కామెడీ చూసే భాగ్యం, అటు సునీల్ కు డబ్బుకు డబ్బు వస్తున్నాయి. కానీ సునీల్ కు మాత్రం ఇంకా హీరో పాత్రల మీద ఆశపోలేదట.
సిల్లీ ఫెలోస్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వూలలో ఈ విషయం బయటపెట్టాడు. రెండు మూడు స్క్రిప్ట్ లు వున్నాయని, త్వరలో వాటి దుమ్ము దులుపుతానని అంటున్నాడు. అంతేకాదు, హీరోగా చేస్తానని, మాంచి స్క్రిప్ట్ ల కోసం చూస్తున్నానని క్లారిటీ ఇచ్చేసాడు.
సునీల్ చెప్పిన మరో గొప్ప పాయింట్ ఏమిటంటే, తనే మూడు కథలు తయారుచేసానని, వాటిని వేరేవాళ్ల చేత డైరక్ట్ చేయిస్తానా? లేక తనే డైరెక్ట్ చేస్తానా? అన్నది ఇంకా డిసైడ్ చేసుకోలేదని చెప్పడం. అంటే అయితే హీరో, ఇంకా పాజిబిలిటీ వుంటే డైరక్షన్ రెండూ చేయాలని కోరిక తనకు వుందని సునీల్ బయటపెట్టాడు.
కానీ సునీల్ అంటే జనాలకు కామెడీ, నవ్వులే అని, ఆ లైన్ లోనే అతగాడిని చూడాలని అనుకుంటారని పక్కాగా ఎప్పుడు తెలుసుకుంటాడో?