అల్లు అర్జున్ చాలా జాగ్రత్త పడుతున్నాడు. టాప్ పొషీషన్లో ఉండాలంటే రిస్క్‌లు తీసుకోకూడదని, ప్రయోగాలు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకొన్నాడట. అందుకే హరీష్ శంకర్‌ని పక్కన పెట్టినట్టు తెలిసింది. గబ్బర్ సింగ్ తరవాత హరీష్ – బన్నీల నుంచి ఓ సినిమా వస్తుందని చెప్పుకొన్నారు. అయితే ఆ సినిమా ఇప్పుడు లేదు.
అంతేకాదు…గోపీచంద్ మలినేనికీ బన్నీ హ్యాండిచ్చాడట. బన్నీ కీ ఈ బలుపు దర్శకుడికీ మధ్య కథాచర్చలు జరిగాయి. అయితే గోపీ ఎన్ని కథలు చెప్పినా బన్నీఓకే చేయడం లేదని సమాచారమ్. దాంతో ఈ ప్రాజెక్టు కూడా లేదని సమాచారమ్. ఇప్పుడు ఈ ఇద్దరు దర్శకులు రవితేజ వెంట పడుతున్నారు.
ఈ ఇద్దరికీ రవితేజతో మంచి సాన్నిహిత్యం ఉంది. చెరో రెండు సినిమాలు చేశారు కూడా. ఇప్పుడు కూడా రవితేజ అభయ హస్తం అందించాడని సమాచారమ్. `రవితేజతో మరో సినిమా చేస్తా` అని ఈమధ్యే హరీష్ చెప్పాడు. అంటే రవితేజతో హ్యాట్రిక్ కాంబినేషన్ మొదలైనట్టే.