ఇండో కెనడియన్ పోర్న్‌స్టార్ సన్నీలియోన్ ‘పోర్న్‌స్టార్’ ఇమేజ్‌ని పూర్తిగా వదిలేశానంటోంది. ఇకపై ఆ ఆలోచనలు కూడా తన మైండ్‌లో వుండవని తెగేసి చెప్పింది సన్నీలియోన్. తానిప్పుడు కేవలం బాలీవుడ్ నటిని మాత్రమేననీ, గతం గురించి ఇకపై మాట్లాడబోననీ అంటోన్న సన్నీలియోన్, బాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఖాళీ లేకుండా టైమ్ గడుపుతున్నానని చెప్పుకొచ్చింది.
హిందీలో పెర్‌ఫెక్ట్‌గా మాట్లాడగలుగుతున్నానని చెబతోన్న సన్నీలియోన్, ‘డబ్బింగ్ సొంతంగా చెప్పుకుంటారా.?’ అనడిగితే మాత్రం, ‘నేను రెడీ.. కానీ దర్శక నిర్మాతలు ఒప్పుకోవాలి కదా..’ అంటోంది. మితిమీరిన అందాల ప్రదర్శనే బాలీవుడ్‌లో నటిగా ఈ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది కదా.. అని ప్రశ్నిస్తే, ‘అదొక్కటే కారణమైతే బాలీవుడ్‌లో నటించేవాళ్ళకి కాక, కేవలం అందాల ప్రదర్శన చేసే వాళ్ళకే అవకాశాలొస్తాయ్ కదా..’ అంటూ ఎదురు ప్రశ్నించింది సన్నీలియోన్.
సౌత్ సినిమాల్లో నటిస్తుండడం చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తోందనీ, బాలీవుడ్‌తో పోల్చితే సౌత్ సినిమా ఇండస్ట్రీ చాలా డిఫరెంట్.. అని అంటోన్న సన్నీలియోన్, తన గతాన్ని పక్కన పెట్టి, తనను అభిమానిస్తోన్నవారందరికీ తానెంతో రుణపడి వుంటానని కాస్త ఉద్వేగానికి లోనవుతోంది. అయినప్పటికీ తన గతం గురించి తానెప్పుడూ చింతించడంలేదనీ, అది ఓ ప్రొఫెషన్‌గానే భావించానని ‘అడల్ట్ ఫిలిం’ కెరీర్ గురించి అభిప్రాయపడిరది సన్నీలియోన్.