వాల్మీకి నైజాం @ 7.30 కోట్లు

14 రీల్స్ సంస్థ హరీష్ శంకర్ డైరక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా నిర్మిస్తున్న సినిమా వాల్మీకి. తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్. ఈ సినిమా వర్క్ దాదాపు పూర్తి కావస్తోంది సెప్టెంబర్ 13…

14 రీల్స్ సంస్థ హరీష్ శంకర్ డైరక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా నిర్మిస్తున్న సినిమా వాల్మీకి. తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్. ఈ సినిమా వర్క్ దాదాపు పూర్తి కావస్తోంది సెప్టెంబర్ 13 విడుదల అంటూ డేట్ కూడా ఇచ్చేసారు. అందుకే మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేసారు.

వాల్మీకి నైజాం హక్కులు 7.30 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమా కొని, జాక్ పాట్ కొట్టిన బయ్యర్ శ్రీనివాసరావు ఈ హక్కులు తీసుకున్నారు. దీంతో మిగిలిన మార్కెట్ కు లీడ్ దొరికినట్లు అయింది. ఈ లెక్కన ఆంధ్ర 10 కోట్ల రేషియోలో అమ్మే అవకాశం వుంది.

వరుణ్ తేజ్ తొలిసారి ఫుల్ రఫ్ గెటప్ తో, రఫ్ క్యారెక్టర్ చేస్తున్న సినిమా ఇది. తమిళ నటుడు అధర్వ మురళి ఈ సినిమాలో మరో కీలకపాత్ర పోషిస్తున్నాడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.