వ్యాంప్‌ క్యారెక్టర్‌ అయితే ఓకేనా.?

‘పులి’ ఫేం నికీషా పటేల్‌ మొన్నామధ్యన కళ్యాణ్‌రామ్‌ హీరోగా వచ్చిన ‘ఓం’ సినిమాలో నటించింది. నెగెటివ్‌ షేడ్స్‌ వున్న పాత్ర ఆమెది ఆ సినిమాలో. వ్యాంప్‌ పాత్రలో కన్పించింది నికీషా పటేల్‌. హాట్‌ అప్పీల్‌…

‘పులి’ ఫేం నికీషా పటేల్‌ మొన్నామధ్యన కళ్యాణ్‌రామ్‌ హీరోగా వచ్చిన ‘ఓం’ సినిమాలో నటించింది. నెగెటివ్‌ షేడ్స్‌ వున్న పాత్ర ఆమెది ఆ సినిమాలో. వ్యాంప్‌ పాత్రలో కన్పించింది నికీషా పటేల్‌. హాట్‌ అప్పీల్‌ కూడా పండించేసింది. హీరోయిన్‌గా ఇక కెరీర్‌ అటకెక్కినట్లే.. అనుకున్నారంతా ఆమెను ఆ సినిమాలో చూసి. అలాంటిది నికీషా పటేల్‌, తెలుగులో స్పెషల్‌ సాంగ్‌ కోసం ఆఫర్‌ వస్తే తిరస్కరించిందట. అది కూడా ఓ యంగ్‌ హీరో సినిమాలో కావడం గమనార్హం.

పవన్‌కళ్యాణ్‌ సరసన అయితే ఐటమ్‌ సాంగ్‌ అయినా ఫర్లేదని నికీషా అంటోందంటూ టాలీవుడ్‌లో గాసిప్స్‌ గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం తమిళ, కన్నడ సినిమాల్లో ఒకటీ అరా అవకాశాలతో కాస్త బిజీగానే వుంది. ఖాళీగా అయితే లేదు నికీషా పటేల్‌. ఈ టైమ్‌లో ఐటమ్‌ సాంగ్‌ చేయడం కాస్త ఇబ్బందికరమైన విషయమేనని నికీషా సన్నిహితులు అంటున్నారట.

‘ఓం’ సినిమాలో చేసింది నెగెటివ్‌ షేడ్స్‌ వున్న పాత్రే అయినా, ఆమె పాత్ర సినిమాలో చాలా భాగం వుంటుంది. సో, సినిమా ఫలితం తేడా కొట్టినా, నికీషా ఏమీ ఫీలవడంలేదట. ఛాన్సొస్తే హీరోయిన్‌గా తన సత్తా ఏంటో ప్రూవ్‌ చేసుకుంటానంటోన్న నికీషాకి ఆశించిన రీతిలో అవకాశాలు వస్తాయా.? ఈలోగా ఐటమ్‌ సాంగే అయినా చేస్తే తప్పేముందట.!