Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప‌బ్‌లో చిందేసిన‌..క‌ల్యాణ్ రామ్‌

ప‌బ్‌లో చిందేసిన‌..క‌ల్యాణ్ రామ్‌

ప‌టాస్ ఇచ్చిన కిక్‌తో హుషారులో ఉన్నాడు క‌ల్యాణ్‌రామ్‌. త‌న కెరీర్‌లోనే ప‌టాస్ తో పెద్ద హిట్ ద‌క్కింది. అదీ.. హిట్టు కొట్టక త‌ప్పదు అనుకొన్న సంద‌ర్భంలో. అందుకే ఆ జోష్ చూపిస్తున్నాడు. 

సోమ‌వారం మీడియా మిత్రుల‌కు క‌ల్యాణ్ రామ్ ఘ‌నంగా పార్టీ ఇచ్చాడు. మాదాపూర్‌లోని ఓ ప‌బ్‌లో విందు ఏర్పాటు చేశాడు. అక్కడ ప‌టాస్ బృందం జోరుగా స్టెప్పులేసింది. ప‌టాస్ లోని పాట‌ల‌కు టీమ్ అంతా సంద‌డిగా కాలు క‌దిపింది. క‌ల్యాణ్ రామ్ కూడా అందులో పాలు పంచుకొన్నాడు. 

అనిల్‌, శ్రీ‌నివాస‌రెడ్డి, 30 ఇయ‌ర్స్ ఫృథ్వీ, పోసాని కృష్ణముర‌ళి.. వీళ్లంద‌రితో క‌ల‌సి హంగామా చేశారు. ఇదే జోష్‌తో షేర్ కూడా హిట్టయిపోతే.. క‌ల్యాణ్ రామ్ కెరీర్ హైవే ఎక్కేసిన‌ట్టే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?