వంశీ పైడిపల్లి-మహేష్ సినిమా ఆగిపోయింది.
అలా అని ఎవరు చెప్పారు.
వార్తలు వచ్చాయిగా..
అధికారికంగా ఎవరన్నా చెప్పారా?
లేదు..అయితే ఇప్పుడేంటీ? మళ్లీ వుంటుందా?
వుండకూడదని ఏమన్నా వుందా?
ఇప్పుడు ఈ కొత్తవాదన ఒకటి వినిపిస్తోంది టాలీవుడ్ లో. మహేష్ కొంచెం టైమ్ ఇచ్చాడని, వంశీ పైడిపల్లి ట్రయ్ చేస్తున్నారని టాక్. దీని వెనుక ఇంకో విషయం కూడా వినిపిస్తోంది. వంశీపైడిపల్లి ని మహేష్ ను కలిపే ప్రయత్నం 'ఎవరో' చేస్తున్నారని.
వాస్తవానికి వంశీ పైడిపల్లి కేవలం దర్శకుడు మాత్రమే కాదు. ఆయనకు మాంచి, గట్టి సంబంధాలు ఎందరో 'పెద్దలతో' వున్నాయి. మహేష్ ప్రాజెక్టు ఆగిపోవడం అన్న వార్తలు వంశీ పైడిపల్లిని బాగా కలచివేసాయని, దాంతో ఆయన వేరే వైపు నుంచి నరుక్కు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
నిజానికి నిర్మాత దిల్ రాజుకు కూడా ప్రాజెక్టు కావాలి. మహేష్ కు ప్రాజెక్టు కావాలి. సరైన స్క్రిప్ట్ తీసుకువస్తే వంశీ పైడిపల్లికి యస్ చెప్పడానికి ఇద్దరికీ అభ్యంతరం లేదు. కానీ కావాల్సిందల్లా సబ్జెక్ట్ మాత్రమే.
అందుకే వంశీ పైడిపల్లి ఇప్పుడు రెండు రకాల ప్రయత్నాలు స్టార్ట్ చేసారని తెలుస్తోంది. ఒకటి సరైన స్క్రిప్ట్ కోసం అన్వేషణ. రెండవది వేరే మార్గాల ద్వారా మహేష్ ను అప్పటి వరకు ఆపే ప్రయత్నం.
చూడాలి ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ గ్యాసిప్ లు ఏ మేరకు నిజం అవుతాయో?