Advertisement

Advertisement


Home > Politics - Gossip

ప్రజాబ్యాలెట్ ప్రకటనలోనే తుస్సుమంటోంది!

ప్రజాబ్యాలెట్ ప్రకటనలోనే తుస్సుమంటోంది!

రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలనుకున్న జగన్ ప్రభుత్వ నిర్ణయం మీద తెలుగుదేశం పార్టీ ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తుందిట. చంద్రబాబు ఇప్పటికే ప్రారంభించిన ప్రజాచైతన్య యాత్రలో భాగంగానే.. ప్రజాభిప్రాయ సేకరణకు కూడా బ్యాలెట్ నిర్వహిస్తామని మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ చెబుతున్నారు. కానీ.. ప్రజాబ్యాలెట్ అనేది తెలుగుదేశం నాయకులు చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నం కానే కాదని.. దీని గురించి ప్రకటన చేస్తున్న సమయంలోనే డొల్లతనం బయటపడిపోతున్నదని అర్థమవుతోంది.

ఎలాగంటే...

జగన్మోహన రెడ్డి సంకల్పించిన అధికార వికేంద్రీకరణ అనేది ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయం చేసేది. చంద్రబాబు సర్కారు అమరావతిలోనే సమస్తమూ కేంద్రీకరించిన నేపథ్యంలో వికేంద్రీకరణ విశాఖ- విజయనగరం, కర్నూలు వాసులకు ఎంతో ఉపకరిస్తుంది. అభివృద్ధికి బాటలు వేస్తుంది. దీనిపై ఆయా ప్రాంతాల స్థానిక నాయకులతో కలిసి తెదేపా ప్రజాబ్యాలెట్ గురించి ప్రకటించి ఉంటే సబబుగా ఉండేది.

అయితే ఇప్పుడు ప్రజాబ్యాలెట్ అంటూ మాట్లాడుతున్న తెదేపా నేతలిద్దరూ అమరావతికి అటూఇటూ ఉండేవారు. కొల్లు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గం అయితే, శ్రావణ్ కుమార్ ది తెనాలి! అమరావతి ప్రాంతానికి చెందిన వారు బ్యాలెట్ నిర్వహిస్తే ఏం తెలుస్తుంది? 71 రోజులుగా దీక్షల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయమే వస్తుంది.

మరో పితలాటకం ఏంటంటే.. చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రజాచైతన్యయాత్రలో భాగంగా అభిప్రాయ సేకరణ చేస్తారట. ఆయన యాత్రలకు వచ్చేవాళ్లంతా తెలుగుదేశం నాయకులు తరలించిన వాళ్లే. కూలి డబ్బులు పుచ్చుకుని సభకు వచ్చేవాళ్లే. వాళ్లతో  ఒక సంతకం కూడా పెట్టించినంత మాత్రాన దానికి విలువ ఎలా దక్కుతుంది?

అలాకాకుండా.. తెదేపా నాయకులకు నిజంగానే ప్రజాబ్యాలెట్ నిర్వహించాలనేంత చిత్తశుద్ధి ఉంటే గనుక.. ముందుగా విశాఖపట్నం, కర్నూలుల్లో అది కూడా వైకాపా గెలిచిన నియోజకవర్గాల్లో బ్యాలెట్ నిర్వహించి.. అక్కడకూడా జగన్ నిర్ణయానికి వ్యతిరేక ప్రజాభిప్రాయాన్ని కూడగట్టగలిగితే గనుక... వారి వాదనలో నిజాయితీ ఉన్నట్లు భావించవచ్చు.

నాలుగేళ్ల తర్వాత హిట్‌ వచ్చింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?