Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వంశీ పైడిపల్లి ఇప్పట్లో సినిమా చేయరట

వంశీ పైడిపల్లి ఇప్పట్లో సినిమా చేయరట

మహేష్ సినిమా చేయడానికి వంశీ పైడిపల్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. పివిపి సంస్థ నిర్మాణం. ఇది అందరికీ తెలిసిన సంగతే. అయితే ఇది సెట్ మీదకు వెళ్లడానికి ఇంచా చాలా టైమ్ వుంది. ఎందుకంటే డిసెంబర్ వరకు మురగదాస్ సినిమాతో బిజీగా వుంటారు మహేష్. ఆ తరువాత కొరటాల శివ సినిమా వుంటుంది. 

అది పూర్తయ్యేసరికి వచ్చే ఏడాది సమ్మర్ దాటేస్తుంది. ఆ తరువాతనే వంశీ పైడిపల్లి సినిమా. మరి అంతవరకు వంశీ ఖాళీగా వుంటారా ? ఈ లోగా మరేమైనా సినిమా చేస్తారా అని ఆ మధ్య తెగ గ్యాసిప్ లు వినిపించాయి. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, మహేష్ సినిమా మరో ఏడాది తరువాత ప్రారంభమైనా సరే, వంశీ పైడిపల్లి ఈలోగా మరే సినిమా చేయరట. 

స్క్రిప్ట్ ను ఫెర్ ఫెక్ట్ గా తయారుచేసుకోవడానికి వంశీకి కనీసం ఆరేడు నెలలు టైమ్ పడుతుందట. అందువల్ల వీలయినంత ప్రశాంతంగా, ఆ స్క్రిప్ట్ మీదనే వర్క్ చేస్తారట. అంతే కానీ గ్యాప్ వుంది కదా అని వేరే సినిమా ఏదీ ఈలోగా చేయరట. అదీ న్యూస్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?