Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గ్యారేజ్ స్పెషల్ సాంగ్ కు టీజర్

గ్యారేజ్ స్పెషల్ సాంగ్ కు టీజర్

సరైన పాట, సిట్యువేషన్ కుదరాలే కానీ, తారక్ డ్యాన్స్ విరగదీసేస్తాడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి సిట్యువేషన్ కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న జనతా గ్యారేజ్ లో కుదిరిందట. క్లయిమాక్స్ ముందు వచ్చే మాస్ నెంబర్ కోసం జనతా గ్యారేజ్ లో ఓ స్పెషల్ సాంగ్ ఫిక్స్ చేసారు. ఈ సాంగ్ కు అద్భుతమైన డ్యాన్స్ మూవ్ మెంట్స్ కుదిరాయట. దాంతో ఎన్టీఆర్ కుమ్మేసాడట. నాలుగు రోజుల పాటు నైట్ అంతా పాట చిత్రీకరించారు. 

కాజల్ కూడా ఎన్టీఆర్ తో సమానంగా డ్యాన్స్ మూవ్ మెంట్స్ అందించాల్సి వచ్చింది. ఎందుకంటే స్పెషల్ సాంగ్ కావడం వల్ల. ఆమె కూడా విపరీతంగా రిహార్సల్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎమోషనల్ సెకండాఫ్ కు ఈ పాట పెద్ద రిలీఫ్ గా వుంటుందని తెలుస్తోంది. ఇదిలా వుంటే సినిమా ఫస్ట్ హాఫ్ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది. క్యూబ్ కి ఇచ్చేస్తున్నారు. సెకండాఫ్ స్మాల్ సిజి వర్క్స్ మాత్రం వున్నాయి. 

26కు ఫస్ట్ కాపీ వస్తుంది. 27న సెన్సారు చేయాలి. కానీ ఆ రోజు శనివారం. అందువల్ల ప్రత్యేక అనుమతి కోసం చూస్తున్నారు. లేదూ అంటే 29న సెన్సారు వుంటుంది. 1న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొసమెరుపు ఏమిటంటే, స్పెషల్ సాంగ్ సూపర్ గా రావడంతో, ఆ పాటకు సంబంధించి ఓ టీజర్ విడుదల చేయాలని డైరక్టర్ కొరటాల శివ భావిస్తున్నట్లు వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?