ఓ మాట చెప్పండి మెగాస్టారూ

గట్టిగా జేబులో అయిదు వందలు వుండవు. కానీ స్టారు పుట్టిన రోజు అంటే ఎలాగోలా అయిదువేలు అన్నా ఖర్చు చేసేస్తారు. అవథులు దాటుతున్న అభిమానం ఇలాగే వుంటుంది. మెగాస్టార్ 61 వ పుట్టిన రోజు…

గట్టిగా జేబులో అయిదు వందలు వుండవు. కానీ స్టారు పుట్టిన రోజు అంటే ఎలాగోలా అయిదువేలు అన్నా ఖర్చు చేసేస్తారు. అవథులు దాటుతున్న అభిమానం ఇలాగే వుంటుంది. మెగాస్టార్ 61 వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు జేబులోంచి కాస్త భారీగానే తీసి ఖర్చు చేస్తున్నట్లు తెలస్తోంది. అయిదు వందల నుంచి పది వేల వరకు కంట్రిబ్యూషన్లు చేస్తున్నట్లు వినికిడి. 

అప్పటికీ ఆ మధ్య నాగబాబు ఫ్యాన్స్ తో సమావేశమై పుట్టినరోజుకు అనవసరంగా భారీ ఖర్చులు వద్దని మరీ చెప్పారు. అయినా అభిమానుల నుంచి భారీగా వసూళ్లు సాగించినట్లు వినికిడి. ఒక్క వెస్ట్ గోదావరి ఏలూరులోనే గడచిన రెండు మూడు రోజుల్లో సాయి ధరమ్, అల్లు శిరీష్ వచ్చినపుడు యాభై వేల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 

ఇలా జిల్లాల వారీగా భారీగా వసూళ్లు, ఖర్చులు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ వ్యవహారాలేవీ చిరంజీవికి పూర్తిగా తెలియదని కూడా టాక్ వినిపిస్తోంది. అభిమానులు టికెట్ కొని సినిమాచూసి హిట్  చేయడమే గొప్ప సంగతి. అది చాలక ఇలా జేబులోంచి వేలు తీసి ఖర్చు చేయడం అంటే చిరంజీవి లాంటి వాళ్లు అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. 

ఫ్యాన్స్ కార్యక్రమాలు చేపడుతుంటే, స్టార్స్ వెళ్లి వాటిని ఎంకరేజ్ చేయడం ఒకవిధంగా బాగానే వుంటుంది కానీ, ఈ ఖర్చు గురించి, ఫ్యాన్స్ స్టామినా, స్తోమత గురించి కూడా ఆలోచించాలి కదా?