ఫ్యాషన్ డిజైనర్ సినిమాలో ప్లస్ పాయింట్లు ఏమిటీ అని ఎవర్ని అడిగినా, పాటలు అని టక్కున చెబుతారు. మూడు పాటలు బాగా చేయించుకున్నాడు దర్శకుడు వంశీ. అలాగే వీలయినంత వైవిధ్యంగా చిత్రీకరించే ప్రయత్నమూ చేసాడు. కానీ ఓ పాట చిత్రీకరణ మాత్రం, ఆయన ఆలోచనల పైత్యానికి పరాకాష్టగా కనిపిస్తుంది.
మేఘాలే తేలె నాలోన అనే పాట ప్రారంభం కావడమే మండుతున్న చితి నేపథ్యంలో ప్రారంభమవుతుంది. చితి మండుతుంటే, చుట్టపక్కాలు శోకాలు పెడుతుంటే, అక్కడ హీరో హీరోయిన్లు డ్యాస్స్ చేస్తుంటారు. గుర్రాల్లా పరుగెడుతుంటారు. అంతలోనే కొన్ని నీడలు వచ్చి సినిమాలో ఫైటింగ్ సీన్ ను ఏక్ట్ చేసేస్తుంటాయి.
ఇంతలో రైలు పరుగెడుతున్న సౌండ్. మరి కాస్సేపటికి ఫోన్ రింగ్ కావడం, ప్రస్తుతం స్పందించడం లేదనే మెసేజ్. ఇలా ఏమిటేమిటో, వెరైటీ అని వంశీ అనుకుని వుండొచ్చు. ఇదేం పైత్యం అని చూసే జనాలు అనుకుంటారని ఆయన గమనించకపోవడం ఏమిటో?