cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

బాలకృష్ణ సినిమాలో లేడీ విలన్!

బాలకృష్ణ సినిమాలో లేడీ విలన్!

బాలకృష్ణ సినిమాల్లో విలన్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాడు. క్లైమాక్స్ లో బాలయ్య అతడ్ని తన కత్తితో ఖండఖండాలు చేస్తాడు. అదే హీరోయిజం అన్నట్టుంటాయి బాలయ్య సినిమాలు. అతడి ఫ్యాన్స్ కూడా అలానే ఫిక్స్ అయిపోయారు. కానీ ఈసారి బాలయ్యకు ఆ అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే, అతడి అప్ కమింగ్ మూవీలో ఉన్నది లేడీ విలన్.

అవును.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య చేయబోతున్న సినిమాలో లేడీ విలన్ ఉంది. ఈ పాత్ర కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ను తీసుకున్నారు. ఆమెకు ఇలాంటి నెగెటివ్ పాత్రలు కొత్తకాదు. రీసెంట్ గా వచ్చిన సర్కార్ సినిమాలో కూడా ఆమె మెయిన్ విలన్. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని బాలయ్య సినిమాకు కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నారు.

నిజానికి బాలకృష్ణ సినిమాల్లో లేడీ విలన్లు కనిపించరు. ఫ్యాక్షనిస్టులు లేదా పొలిటీషియన్లు మాత్రమే విలన్లుగా ఉంటారు. తొడకొట్టి వాళ్లకు సవాల్ చేయడం, కత్తితో నరికేయడం లాంటివి చేస్తుంటాడు బాలయ్య. మరి లేడీ విలన్ ను ఎదురుగా పెట్టుకొని బాలయ్య ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

మరోవైపు యూనిట్ మాత్రం మెయిన్ విలన్ వరలక్ష్మి కాదంటోంది. నెగెటివ్ షేడ్స్ తో ఉన్న ఓ చిన్న పాత్రను ఆమె పోషించబోతోందని చెబుతోంది. ఒకటి మాత్రం నిజం. బాలయ్య సినిమాపై గతంలో ఎన్నడూ ఇన్ని పుకార్లు లేవు. ఈసారి మాత్రం అతడు చేయబోయే సినిమాకు సంబంధించి లీకుల మీదు లీకులు వస్తున్నాయి.

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!