Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మేమిద్దరం రెడీ.. స్క్రిప్ట్ తీసుకురండి

మేమిద్దరం రెడీ.. స్క్రిప్ట్ తీసుకురండి

తమన్న, కాజల్ బెస్ట్ ఫ్రెండ్స్. కలిసి సినిమా చేయాలనే కోరిక వీళ్లిద్దరికీ ఉంది. కానీ మేకర్స్ ఎవరూ ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు కనిపించడం లేదు. తాజాగా కాజల్ మరోసారి ఇదే ప్రకటన చేసింది. తమన్నతో కలిసి క్లోజ్ గా దిగిన ఓ ఫొటోను షేర్ చేసిన కాజల్, "మేమిద్దరం ఒకే ఫ్రేమ్ లోకి రావడానికి పెర్ ఫెక్ట్ స్క్రిప్ట్ తో పనేముంది" అంటూ టీజింగ్ గా ఓ స్టేట్ మెంట్ కూడా పెట్టింది.

కాజల్ తో కలిసి ఓ సినిమా చేయాలని ఉందంటూ తమన్న ఇప్పటికే ప్రకటించింది. ఓ కోలీవుడ్ వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ తో కలిసి మల్టీస్టారర్ చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. అదే ఇంటర్వ్యూకు సోషల్ మీడియాలో కాజల్ కూడా ప్రతిస్పందించింది. నేను కూడా రెడీ తమన్నా అంటూ రియాక్ట్ అయింది.

వీళ్లిద్దరూ ఇంతలా ఇలా ఓపెన్ అవుతున్నప్పటికీ మేకర్స్ మాత్రం ఇప్పటివరకు ఈ కాంబినేషన్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు. కోలీవుడ్ సంగతి పక్కనపెడితే, టాలీవుడ్ నుంచి ఎవరూ ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించలేదు.

కలిసి నటించకపోయినా ఇద్దరూ కలిసి తాజాగా ఒకే రీమేక్ చేశారు. హిందీలో హిట్ అయిన క్వీన్ సినిమాను తమన్న తెలుగులో రీమేక్ చేస్తే.. కాజల్ తమిళ్ లో రీమేక్ చేసింది. 

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?