ఏఫ్ 2 సినిమా విడుదలయింది. టాక్ సంగతి అలా వుంచితే అంతరిక్షం సినిమాతో నిరాశ పడిన హీరో వరుణ్ తేజ్ కు కాస్త ఫరవాలేదు అనిపించే సినిమానే. ఇష్టపడి, కష్టపడి చేసిన అంతరిక్షం కన్నా, కమర్షియల్ గా ఇదే కాస్త బెటర్. అయితే, వాస్తవానికి ఈ పాత్ర చేయాల్సింది నితిన్. అందుకోసమే తెలంగాణ స్లాంగ్ కూడా చేర్చారు. వెంకీ-నితిన్ కాంబినేషన్ అనుకున్నారు.
కానీ అప్పట్లో నితిన్ తో హరీష్ శంకర్ దాగుడుమూతులు కూడా ప్లానింగ్ లో వుంది. దిల్ రాజు బ్యానర్ లో నితిన్ సినిమాలు వరుసగా రెండు మూడు అయ్యేటట్లు కనిపించింది పరిస్థితి. దాంతో వరుణ్ ను లైన్లోకి తీసుకువచ్చారు దిల్ రాజు. కానీ ఆ తరువాత దాగుడు మూతలు స్క్రిప్ట్ నచ్చక ప్రాజెక్టునే పక్కన పెట్టారు అది వేరే సంగతి.
మొత్తంమీద నితిన్ ప్లేస్ లో వరుణ్ వచ్చాడు. నితిన్ కు ఈ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు రెండు లేకుండా అయిపోయి, బాగా గ్యాప్ వచ్చేసింది.