వాటా కోసం మహేష్ వెంట

మహేష్ తో సినిమా చేయాలని ఏ నిర్మాతకు వుండదు. ఆ మాటకు వస్తే మహేష్, పవన్, ప్రభాస్ లాంటి ఏస్ హీరోలతో సినిమా అంటే ఏ నిర్మాత అయినా ఎగిరి గంతేస్తాడు. అందుకే ఇప్పుడు…

మహేష్ తో సినిమా చేయాలని ఏ నిర్మాతకు వుండదు. ఆ మాటకు వస్తే మహేష్, పవన్, ప్రభాస్ లాంటి ఏస్ హీరోలతో సినిమా అంటే ఏ నిర్మాత అయినా ఎగిరి గంతేస్తాడు. అందుకే ఇప్పుడు మహేష్ వెంట ఒకరిద్దరు పడుతున్నారు. దేనికీ? డివివి దానయ్య-కొరటాల శివ కాంబినేషన్ లోని సినిమాలో తమను కూడా కలపమని. మహేష్ సినిమా అంటే వందకోట్ల వ్యవహారం. నిర్మాణానికే 60 నుంచి 70 కోట్లు కావాలి. 

అందుకే దానయ్యతో పాటు తాము పాలు పంచుకుంటామని ఇద్దరు నిర్మాతలు మహేష్ ను అడుగుతున్నట్లు వినికిడి. వీరిలో దిల్ రాజు ఒకరని టాలీవుడ్ లో వినిపిస్తోంది. అలాగే సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న ఓ ప్రముఖ న్యాయవాది కూడా మహేష్ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటానని అంటున్నట్లు తెలుస్తోంది. డిస్కషన్లు ఏ మేరకు ఎక్కడ ఆగుతాయో చూడాలి. అసలు ఇప్పటికే ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చిన అశ్వనీదత్ మాటేమిటో? పాపం.