Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెంకట్ బోయినపల్లి తో నాని

వెంకట్ బోయినపల్లి తో నాని

ఎప్పటి నుంచో హీరో నానితో సినిమా చేయాలని కోరిక వెంకట్ బోయినపల్లి కోరిక. ఇంతకీ వెంకట్ బోయినపల్లి అంటే తెర ముందు జనాలకు అంతగా తెలియదు. తెరవెనుక జనాలకు బాగానే తెలుసు.

14 రీల్స్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్, మైత్రీ మూవీస్ లాంటి బ్యానర్ లతో ఆయనకు అనేకానేక సన్నిహిత సంబంధాలున్నాయి. అలాంటి వ్యక్తికి నానితో సినిమా తీయాలని ఎప్పటి నుంచో కోరిక. ప్రతి ఏటా నాని బర్త్ డే కు ప్రాంప్ట్ గా అభినందనల ప్రకటనలు బోలెడు ఖర్చు చేసి మరీ వేస్తుంటారు.

ఇన్నాళ్లకు ఆయన నిరీక్షణ ఫలించినట్లే. నాని తో వెంకట్ బోయినపల్లి సినిమా చేయబోతున్నారు. వెంకట్ బోయినపల్లితో నానికి వున్న అనుబంధం ఆయనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం చేస్తున్న టక్ జగదీష్ తరువాత ఈ సినిమా వుంటుందని తెలుస్తోంది. అయితే టక్ జగదీష్ తరువాత శ్యామ్ సింగ రాయ్ చేయాలి. కానీ ఆ సినిమాను తరువాత చేస్తారని చేస్తారని ముందే వెంకట్ బోయనపల్లికి సినిమా చేస్తారని వినిపిస్తోంది.

అంటే మరో కథ, మరో డైరక్టర్ నానికి దొరికినట్లు అనుకోవాలో లేదా ఈ శ్యామ్ సింగ రాయ్ నే వెంకట్ బోయినపల్లికి చేసి, మరో సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు చేస్తారో? ఎందుకంటే ఈ కాలంలో హీరోలే కథలు విని, డైరక్టర్ ను సెట్ చేసుకుని నిర్మాతల దగ్గరకు పంపిస్తున్నారు. ఆ మధ్య దిల్ రాజు సినిమాను మైత్రీకి అలాగే పంపించారు. మైత్రీ సినిమాను దిల్ రాజుకు పంపారు. 

వైయస్సార్ దగ్గర చంద్రబాబు డబ్బులు తీసుకునేవాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?