Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెంకీ మామకు కొత్తడేట్?

వెంకీ మామకు కొత్తడేట్?

సురేష్ బాబు నిర్మించే సినిమాలు అంటే వ్యవహారం అలాగే వుంటుంది. రిలీజ్ డేట్ ఒకంతట ఫిక్స్ కాదు. రకరకాలు ట్రయ్ చేస్తుంటారు. పీపుల్స్ మీడియాతో కలిసి చైతూ-వెంకీల కాంబినేషన్ లో వెంకీమామ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ముందుగా వినిపించిన డేట్ అక్టోబర్ 4. మెగాస్టార్ మెగా మూవీ వచ్చినా కూడా ఈ డేట్ కు రావాలని ఆరంభంలో అనుకున్నట్లు వార్తలు వచ్చాయి.

డేట్ మారడానికి యూనిట్ రీజన్లు ఏమయినా, వాయిదా అయితే తప్పలేదు. ఆ తరువాత దీపావళి సందర్బంగా అక్టోబర్ 25 అన్న డేట్ తెరపైకి వచ్చింది. అప్పటికి ఆ డేట్ సోలో. కానీ ఇప్పుడు ఆ డేట్ ఫుల్ టైట్. విజయ్-అట్లీ కాంబినేషన్లోని 'విజిల్', కార్తీ తమిళ డబ్బింగ్ సినిమా, అల్లరి నరేష్ బంగారు బుల్లోడు సినిమాలు వస్తాయని తెలుస్తోంది.

అందుకే వెంకీమామ మళ్లీ మరో డేట్ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయని తెలుస్తోంది. అప్పుడైతే ప్రస్తుతానికి ఏ సినిమా లేదు.

జగన్... గారాబం చేయడం నేర్చుకోవాలి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?