Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సునీల్ నుంచి సప్తగిరికి

సునీల్ నుంచి సప్తగిరికి

కొన్ని ఏళ్ల కిందటి నుంచి బాహుబలి కథకుడు విజయేంద్ర ప్రసాద్ దగ్గర ఓ కథ నలుగుతోంది. ఆ కధను అప్పట్లో కమెడియన్ కమ్ హీరో సునీల్ తో తీయాలని అనుకున్నారు. కథ చెప్పడం, డిస్కషన్లను వంటివి నడిచాయి. కానీ మరి ఏమయిందో, అంతకన్నా ముందుకు వెళ్లలేదు. ఆ తరువాత ఆ వ్యవహారం అలా సద్దుమణిగింది.

లేటెస్ట్ గా విజయేంద్ర ప్రసాద్ కథతో కమెడియన్ కమ్ హీరో సప్తగిరి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు స్వర్ణ సుబ్బారావు అనే ఒక్కసినిమా చేసిన డైరక్టర్ పని చేస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ ఎలాగూ దర్శకత్వ పర్యవేక్షణ అయితే చేస్తారు. అందుకే ఈ చిన్న డైరక్టర్ ను తీసుకుని వుండొచ్చు.

సప్తగిరి హీరోగా నిలదొక్కుకోవాలని ట్రయ్ చేస్తున్నారు. అయినా ఫలితం దక్కడంలేదు. ఈ టైమ్ లో విజయేంద్ర ప్రసాద్ కథ, ప్రాజెక్టు అంటే కాస్త ఆశలు పెట్టుకోవచ్చు. కానీ ఎక్కడో చిన్న డవుట్ కొడుతూనే వుంటుంది. రాజమౌళికి కాకుండా తెలుగులో విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథలు పెద్దగా వర్కవుట్ కావడం తక్కువ. చూడాలి ఏమవుతుందో ఈసారి.

జగన్... గారాబం చేయడం నేర్చుకోవాలి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?