మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయ్!

ఈ ఏడాది డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలంటూ అధికారులకు పిలుపునిచ్చారు మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. నవంబర్ లో ఎన్నికలకు…

ఈ ఏడాది డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలంటూ అధికారులకు పిలుపునిచ్చారు మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. నవంబర్ లో ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయని, డిసెంబర్లో ఎన్నికల నిర్వహణ ఉంటుందని బొత్స ప్రకటించారు.

దాదాపు ఏడాది కిందటే మున్సిపల్ ఎన్నికలు జరగాల్సింది. అప్పుడు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ముందుకు రాలేదు. సార్వత్రిక ఎన్నికల ముందు మున్సిపల్ ఎన్నికలు ఎందుకనుకున్నారో కానీ.. వాటినైతే నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం వచ్చీ రాగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు సాగిస్తూ ఉంది. వీటికి కొన్ని రకాల చట్టపరమైన అడ్డంకులున్నాయనే మాట వినిపిస్తూ ఉంది.

వాటి సంగతేమో కానీ.. డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని బొత్స ప్రకటించారు. సమాయత్తం కావాలని అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత అత్యంత ఆసక్తిదాయకమైనవి మున్సిపల్ ఎన్నికలే. సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత పట్టణ, నగర ప్రాంతాల్లో ఏ పార్టీ బలం ఎంతో తేల్చేవి కూడా ఈ ఎన్నికలే. తమ బలాబలాలు ఏ స్థాయిలో ఉన్నాయో నిరూపించుకోవడానికి అన్ని పార్టీలకూ ఇది మరో అవకాశం.

నీ సినిమా గురించి అడిగి కడిగి పారేస్తా.. హీరో