cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెయ్యి ఎకరాలు-వెయ్యి కోట్లు

వెయ్యి ఎకరాలు-వెయ్యి కోట్లు

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ తెలిసి అన్నారో తెలియక అన్నారో టాలీవుడ్ పెద్లలు భూములు పంచుకుంటున్నారా? అని నిజానికి పంచుకోవడం లేదు కానీ, అలాంటి దానికి తావిచ్చే ఓ అధ్భుతమైన, బహులార్థకమైన స్కీము ఒకటి రాష్ట్ర ప్రభుత్వం మదిలో వుందని తెలుస్తోంది. తెలంగాణలో అన్ని రంగాలను తన దైన శైలిలో ముందుకు తీసుకెళ్లున్న ముఖ్యమంత్రి కేసిఆర్ సినిమా రంగం కోసం కూడా అద్భుతమైన ఆలోచన చేసినట్లు బోగట్టా.  నిజానికి అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆయన రాచకొండ గుట్టల్లో పెద్ద పిలిం స్టూడియో ప్రభుత్వం తరపున నిర్మిద్దాం అనుకున్నారు. హెలికాప్టర్ లో భూములు పరిశీలించారు. కానీ అది ఎందుకో ఆగింది.

కానీ కరొనా నేపథ్యంలో హైదరాబాద్ భవిష్యత్ కాస్త అయోమయం అవుతుందన్న వార్తలు రావడంతో, అన్ని విధాల ఉపయోగపడే ఆలోచన ఒకటి కేసిఆర్ చేసినట్లు తెలుస్తోంది.  ఈ మేరకు ఆయన తన ఆలోచనలను కొందరు సినిమా పెద్దలతో పంచుకున్నట్లు తెలుస్తోంది.. ఐటి అంటే దేశం మొత్తం మీద హైదరాబాద్ కు పేరు వుంది. అదే విధంగా సినిమా నిర్మాణం అంటే హైదరాబాద్ గుర్తుకువచ్చేలా చేయాలన్నది ఆయన ఆలోచన.  అలా చేసిన పక్షంలో అటు సినిమా పరిశ్రమ, దాంతో పాటు దాని అనుబంధ పరిశ్రమలు, అలాగే దానివల్ల టూరిజం, రియల్ ఎస్టేట్, హోటల్ ఇలా చాలా రంగాలు హైదరాబాద్ లో అద్భుతంగా అభివృద్ధి చెందుతాయని ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.

ఫిలి యూనివర్సిటీ

''....అవసరం అయితే వెయ్యి కోట్లు, వెయ్యి ఎకరాలు కేటాయిద్దాం. ఓ ఫిలిం యూనివర్సిటీ నిర్మిద్దాం. ఇలాంటిది దేశంలో ఎక్కడా లేదు. అన్ని క్రాఫ్ట్ ల్లో కోర్సులు నిర్వహించేలా చర్యలు తీసుకుందాం. దీంతో యువతకు చాలా అవకాశాలు వస్తాయి. దేశం మొత్తం సినిమా నిర్మించాలంటే హైదరాబాద్ వైపు తిరిగి చూడాలి. అసలే మహరాష్ట్ర కరోనా కారణంగా ఇబ్బందుల్లో వుంది. ఇలాంటి టైమ్ లో అవకాశాలు మనం అందిపుచ్చుకోవాలి..ఈ మేరకు మీ మీ సలహాలు ఇవ్వండి...ఓ ప్లాన్ చాక్ అవుట్ చేద్దాం....' అని కేసిఆర్ సినిమా పెద్దలకు చెప్పారన్న వార్తలు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 

బహుశా ఇంతటీ భారీ పథకం వస్తే, ఎవరైతే టాలీవుడ్ నుంచి లీడ్ తీసుకుంటున్నారో వారే లబ్ది పొందుతారని, లేదా వివిధ నిర్మాణలకు ప్రభుత్వం తరపున భూములు తీసుకుంటారని, స్టూడియోలు, ఇతరత్రా నిర్మాణలు చేపడతారని టాలీవుడ్ లో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇదంతా బాలయ్య దృష్టికి వెళ్లడంతో ఆయన అనాలోచితంగానో, ఆవేశంలోనో నోరు జారి వుండొచ్చు. 

కానీ కేసిఆర్ ఈ ఆలోచన చేయడం సబబే. ఆయన అనుకున్న ప్రణాళిక కనుక రూపుదాల్చితే, టాలీవుడ్ లో విపరీతంగా ఉద్యోగవకాశాలు, పెట్టుబడి అవకాశాలు వస్తాయి. ఎప్పుడుయితే ఇండియన్ సినిమాకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారుతుందో, అది  మిగిలిన రంగాల మీద విపరీతంగా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కు బూమ్ వస్తుంది. హోటల్, ట్రాన్స్ పోర్ట్, టూరిజం రంగాలు అభివృద్ధి చెందుతాయి. 

కానీ ఒక్కటే చూసుకోవాలి. గతంలో చెన్నయ్ నుంచి హైదరాబాద్ తరలించినపుడు సినిమారంగం ఇన్ ఫాస్ట్రక్చర్ అంతా ఓ వర్గం చేతుల్లోకి తీసుకుంది. అలా తీసుకోవడం వల్ల వాళ్ల వాళ్ల కుటుంబాల్లోంచి హీరోలను తయారుచేసారు. నటులను తయారుచేసారు. వాళ్లను చలామణీ చేయగలిగారు. ఎప్పడయితే ఇన్ ఫాస్ట్రక్చర్ అన్నది వివిధీకరణతో కూడినదై, కార్పొరేట్ రంగం చేతిలోకి వెళ్తుందో అప్పుడు ఎందరో ఔత్సాహికులు నటులుగా మరింతగా రావడానికి అవకాశం వుంది. ఈ వారసత్వ హీరోల హవా తగ్గుతుంది.

అందువల్ల కేసిఆర్ ఆ దిశగా కూడా ఆలోచించి, నేషనల్ బిడ్డింగ్, బాలీవుడ్ జనాలను కూడా ఆహ్వానించి, ఇలాంటి బృహత్తర ప్రణాళిక అమలు చేయడం బెటర్ అనే సలహాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

నిమ్మగడ్డకు ఆ అధికారం లేదు

లంచాల మాట లేని ప్రభుత్వ పాలన: సీఎం జగన్‌

 


×