Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

విదేశీ సినిమాల హక్కుల తో బిజినెస్!

విదేశీ సినిమాల హక్కుల తో బిజినెస్!

ఇన్ని రోజులూ ఇండియన్ ఫిల్మ్ మేకర్లు సింపుల్ గా కాపీ  ప్రక్రియనే అనుసరించారు. హాలీవుడ్ లోనో.. లేక కొరియన్ మూవీలనో.. లేక ఇంకా ఎక్కడైన హిట్ అయిన సినిమాలనైనా మనోళ్లు కాపీ కొట్టేస్తూ పబ్బం గడుపుకొంటూ ఉన్నారు. సీన్లను కాపీ కొట్టి సంతృప్తి పడే వాళ్లు కొందరైతే.. మొత్తానికే ఎసరు పెట్టి.. కార్బన్ కాపీలు చేసే వారు మరికొందరు. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అలాంటి కాపీ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చి.. దర్జాగా హక్కులు కొనుక్కొని రీమేక్ లు చేసే వారు తయారయ్యారు. 

ఈ విషయంలో కమల్ హాసన్ వంటి వాళ్లు ముందున్నారు. కేవలం కమలే కాదు.. ఇప్పుడు బాలీవుడ్ లో కరణ్ జోహార్ ఈ విషయంలో ఉత్సాహవంతుడిగా కనిపిస్తున్నాడు. ఇంతకు ముందు.. ఒక హాలీవుడ్ సినిమాను 'బ్రదర్స్' పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశాడు కరణ్. కాపీ కొట్టేయకుండా.. దర్జాగా హక్కులు తీసుకుని ఆ సినిమాను రీమేక్ చేసి నిర్మాతగా హిట్ ను అందుకున్నాడు ఈ మూవీ మేకర్. కేవలం ఆ సినిమాతోనే ఆగిపోలేదు మరిన్ని సినిమాల విషయంలో కూడా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడు కరణ్. 

ఇటీవల తెలుగులో రీమేక్ అయిన 'ఊపిరి' సినిమాకు ఒక ఫ్రెంచి సినిమా ఆధారం అని వేరే చెప్పనక్కర్లేదు. ముందుగా ఈ సినిమా హక్కులను ఇండియా వరకూ కొనేసుకొంది కరణే! ఆయన దగ్గర నుంచినే పీవీపీ వాళ్లు తెలుగు రీమేక్ రైట్స్ ను పొందారు.  ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ సక్సెస్ అయ్యే సరికి హిందీలో దీన్ని రూపొందించే పనిలో పడ్డాడు కరణ్. మొత్తానికి విదేశీ సినిమాల హక్కులను కొనడం ద్వారా కరణ్ కు బాగానే గిట్టుబాటవుతున్నట్టుంది!

అఖిల్ కు వేరే కథ దొరక్క.. చివరకు ముందనుకొన్నదే?!

తొలి సినిమాతో హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తాడనుకొంటే.. అది కాస్తా డిజాస్టర్ గా మిగిలిపోవడంతో కేవలం అఖిల్ మాత్రమే కాదు అతడి తండ్రి నాగార్జున కూడా కొంత నిరాశ పడ్డాడు. అయినా తొలి సినిమా పోయినంత మాత్రనా వచ్చే నష్టం ఏమీ లేదు.. సత్తా చాటడానికి ఇంకా చాలా అవకాశాలున్నాయని అక్కినేని ఫ్యామిలీ ధైర్యంగానే ఉంది. ఈ కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ.. రెండో ప్రయత్నానికి కావాల్సినంత కాన్ఫిడెన్స్ ను ఇచ్చే కథ మాత్రం వారికి ఎంతకూ దొరకడం లేదు!

ఇప్పటికే అఖిల్ విడుదలై నెలలు గడిచిపోయినా.. రెండో సినిమా  ఊసు వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున తన తనయుడి రెండో సినిమా విషయంలో ఇది వరకూ పరిశీలించిన కథనే పునఃపరిశీలన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తొలి సినిమా కు కథను వెదుకుతున్న రోజుల్లో నాగార్జున.. హిందీ సినిమా 'ఏ జవానీ హే దివానీ' సినిమా కథను పరిశీలించాడు. ఆ సినిమా రీమేక్ ద్వారా అఖిల్ ను తెలుగు వాళ్లకు పరిచయం చేయాలని భావించాడు. అయితే ఆ తర్వాత 'అఖిల్' కథ తెరపైకి వచ్చింది. తెరకెక్కింది. 

అయితే ఇప్పుడు రెండో సినిమా విషయంలో కథను వెదుకుతున్న నాగార్జున తిరిగి హిందీ సినిమా రీమేక్ పై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఎలాగూ కాన్ఫిడెన్స్ ను ఇచ్చే కథ వినపడకపోయే సరికి.. రీమేక్ మీదే మళ్లీ దృష్టి పెట్టాడని తెలుస్తోంది. తొలి సినిమా కు అనుకున్న కథతో రెండో సినిమాను తెరకెక్కించడానికి రంగం సిద్ధం అవుతోందని సమాచారం. మొత్తానికి టాలీవుడ్ లో కథల కొరత ఎంతగా ఉందో తెలియజెప్పుతోంది ఈ ఉదంతం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?