విడుదల తేదీలపైనే అందరి ఆలోచన

శంకర్ భారీ విజువల్ ట్రీట్ ఐ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది..డిసెంబర్ లో వస్తుందా? దాని సంగతి పక్కనపెడితే, రజనీ-రవికుమార్ ల కాంబినేషన్ లోని లింగా విడుదల ఎప్పుడు?  Advertisement ఇప్పుడు టాలీవుడ్ సినిమా నిర్మాతల…

శంకర్ భారీ విజువల్ ట్రీట్ ఐ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది..డిసెంబర్ లో వస్తుందా? దాని సంగతి పక్కనపెడితే, రజనీ-రవికుమార్ ల కాంబినేషన్ లోని లింగా విడుదల ఎప్పుడు? 

ఇప్పుడు టాలీవుడ్ సినిమా నిర్మాతల ఆలోచనలు అన్నీ ఈ రెండింటివైపే, వాటి విడుదల తేదీలకు అనుగుణంగా తమ సినిమా తేదీలను ప్లాన్ చేసుకోవాల్సి వుంది మరి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఐ సినిమా విడుదల ఇప్పట్లో లేనట్లే. 

లింగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 12న విడుదల చేయాలని అనుకుంటున్నట్లు బోగట్టా. అందుకే దానికి ఒక వారం గ్యాప్ ఇచ్చి 25 లేదా 26న ముకుందా విడుదల చేయాలనుకుంటున్నారు.25 క్రిస్మస్ కాబట్టి, నాలుగు రోజులు కలెక్షన్లు కలిసి వస్తాయి. 

వీటికిముందుగానే డిసెంబర్ అయిదున చాలా చిన్న సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. వీటిలో రాజశేఖర్ గడ్డం గ్యాంగ్ కూడా వుంది.

దానికి రెండువారాలు గ్యాప్ ఇచ్చి 9న ఎన్టీఆర్, పూరి సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. గోపాల గోపాల సంక్రాంతికి డిసైడ్ అయింది. వీటన్నింటి నడుమ డేట్లు డిసైడ్ కావాల్సిన సినిమాలు చాలా వున్నాయి. 

రవిబాబు అవును పార్ట్ 2, కళ్యాణ్ రామ్ పటాస్,  సాయి కొర్రపాటి తుంగభద్ర, మారుతి టాకీస్ 'కాయ్ రాజా కాయ్', అన్నీ పూర్తయితే నాగ చైతన్య సినిమా, విజయ్ డబ్బింగ్ సినిమా కత్తి, సందీప్ కిషన్ బీరువా, అల్లరి నరేష్ బందిపోటు, ఇలా చాలా వున్నాయి.

 వీటిలో కొన్ని ఇంకా ముస్తాబు దశలో వున్నాయి. జనవరి దాటితే ఫిబ్రవరి అంతంత మాత్రం సీజన్. మార్చి, ఏప్రిల్ మరచిపోవాలి. మళ్లీ సమ్మర్ దాకా సరైన స్లాట్ దొరకదు. అందుకే నిర్మాతలంతా కిందా మీదా పడుతున్నారు.