ఇప్పుడు విజయ్ దేవరకొండ టైమ్ నడుస్తోంది. అతగాడి క్రేజ్ రాను రాను ఆకాశాన్నంటుతోంది. నోటా సినిమా ఫంక్షన్ కోసం విజయవాడ వెళ్లిన విజయ్ కు లభించిన ఆదరణ చూస్తుంటే, ఆ ఏజ్ స్టార్ లలో ఎవ్వరూ అంత ఇమేజ్ తెచ్చుకున్న దాఖలా కనిపించడం లేదు. ఎన్టీఆర్ కు స్టార్టింగ్ లోనే అలాంటి ఇమేజ్ వచ్చింది. కానీ అతని వెనుక నందమూరి ఫ్యామిలీ వుంది.
ఎటువంటి బ్యాకింగ్ లేకుండా, యువత ఇలా భయంకరంగా అభిమానించేయడం అంటే చాలా అంటే చాలా ఆశ్చర్యమే. విజయవాడలో ఈ సాయంత్రం నోటా పబ్లిక్ ఫంక్షన్ జరిపారు. కుర్రాళ్లు ఫంక్షన్ కు వెల్లువెత్తారు. ఆడిటోరియం సరిపోలేదు. జనాల తాకిడి ఆఢిటోరియం అద్దాలు పగలడం, చిన్నా చితకా దెబ్బలు తగలడం మామూలే.
విజయ్ తన స్పీచ్ కూడా వైవిధ్యంగానే ఇచ్చాడు. తను చేసిన నాలుగు సినిమాల్లో మూడు ఆడాయి, ఒకటి దొబ్బేసింది అని నిర్మొహమాటంగా చెప్పేసాడు.అమరావతి రాజధాని వంటి వ్యవహారాలు, రెండు తెలుగు రాష్ట్రాలు, ఒకటే భావన వంటి పెద్ద మాటలు కూడా మాట్లాడాడు.
విజయ్ దీనికి సారీ కూడా చెప్పాడు. కచ్చితంగా మళ్లీ వస్తానని, మరింత పెద్ద ఆడిటోరియం లో కలుద్దామని మాట ఇచ్చాడు. ఈ ఊపు, ఈ జోరు చూస్తుంటే నోటా ఓపెనింగ్ కలెక్షన్లు కుమ్మేసాలా వుంది వ్యవహారం. సినిమా ఏమాత్రం బాగుందని టాక్ వచ్చినా, మళ్లీ మరో బ్లాక్ బస్టర్ కావడం ఖాయం.