విజయ్ దేవరకొండ వేదిక మీదకు రావాలి

విజయ్ దేవరకొండ..యంగ్ జనరేషన్ హీరోల్లో సూపర్ స్టార్ లెక్క. పది కోట్ల పారితోషికం అందుకుంటున్న హీరో. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని, పాన్ ఇండియా హీరో కావాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే పూరి…

విజయ్ దేవరకొండ..యంగ్ జనరేషన్ హీరోల్లో సూపర్ స్టార్ లెక్క. పది కోట్ల పారితోషికం అందుకుంటున్న హీరో. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని, పాన్ ఇండియా హీరో కావాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే పూరి జగన్నాధ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా వుంటాడు విజయ్. కానీ కరోనా విషయంలో మాత్రం అస్సలు స్పందించడం లేదు.

హీరోలు అంతా కోట్లు, లక్షలు విరాళాలు ప్రకటిస్తుంటే విజయ్ మాత్రం మౌనంగా వున్నాడు. ఎందుకీ మౌనం అన్నది తెలియదు. విజయ్ ఊ అనకుండానే ఆయన ట్వీట్లు, ఆయన విషయాలు ఎప్పటికప్పుడు తీసుకువచ్చి వాట్సాప్ లో పోటా పోటీగా ప్రచారం సాగించే పీఆర్వో బృందాలు కూడా ఇప్పుడు మౌనంగా వున్నాయి.

విజయ్ ఏదో ప్లానింగ్ లో వున్నారని, ప్రకటిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇండస్ట్రీలో విజయ్ మాత్రమే కాదు, ఇంకా చాలా మంది పెద్ద హీరోలు. కూడా ఇవ్వలేదు కదా అని ఆ వర్గాలు అంటున్నాయి. గతంలో విజయ్ ముందుకు వచ్చిన సందర్భాలు వున్నాయని, ఇప్పుడు కూడా వస్తాడని చెబుతున్నారు.

క‌రొనా పై చిరు-నాగ్ పాట చూశారా?

ఏప్రిల్ 7వ తేదీకి కేసులన్నీ ఖతం