విజయ్ దేవరకొండ.. తాజా టాలీవుడ్ సంచలనం.. టాలీవుడ్ జనాలంతా ఓ సూపర్ స్టార్ పుట్టాడు అని చెబుతున్న హీరో. ప్రస్తుతం ఓ సినిమా విడుదలకు రెడీ అయింది. మరో సినిమా టాక్సీవాలా విడుదలకు రెడీగా వుంది. డియర్ కామ్రేడ్ సినిమా రెడీ అవుతోంది. డియర్ కామ్రేడ్ 2019లో విడుదల వుంటుంది.
ఆ తరువాత మళ్లీ తమిళ నిర్మాతకే ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ ఇద్దరు తమిళ నిర్మాతల దగ్గర ఎప్పుడో లాంగ్ బ్యాక్ అడ్వాన్స్ లు తీసుకున్నారు. ఒకరు జ్ఞాన్ వేల్ రాజా. మరోకరు ఎస్ ఆర్ ప్రభు. చిత్రంగా ఈ ఇద్దరూ తమిళ హీరో సూర్యకు చుట్టాలే. ఒకరు బాగా దగ్గర. మరొకరు కాస్త దూరం.
సో, ఇప్పుడు ఎస్ ఆర్ ఫ్రభుకు ఓ సినిమా చేయాలి. ఓ తమిళ మహిళా దర్శకురాలు ఈ మేరకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఆ విధంగా తన మార్కెట్ పెంచుకోవాలనుకుంటున్నారు. నోటా ఇప్పుడు మళయాళం, తమిళంలో కూడా విడుదలవుతుంది. అలాగే ఎస్ ఆర్ ప్రభుకు చేసే సినిమా కూడా మూడు భాషల్లో విడుదలవుతుంది.