విక్రమ్ కుమార్ హర్రర్ సినిమా?

13 బి సినిమా తెలుగు జనాలకు కాస్త తక్కువ పరిచయం. విక్రమ్ కే కుమార్ తీసిన మాంచి హర్రర్ సినిమా అది. ఆ సినిమా తరువాత మళ్లీ ఆ తరహా సినిమాలు చేయలేదు చేసిన…

13 బి సినిమా తెలుగు జనాలకు కాస్త తక్కువ పరిచయం. విక్రమ్ కే కుమార్ తీసిన మాంచి హర్రర్ సినిమా అది. ఆ సినిమా తరువాత మళ్లీ ఆ తరహా సినిమాలు చేయలేదు చేసిన జోనర్ లో సినిమా చేయకుండా చేసుకుంటూ వస్తున్నారు. అయితే త్వరలో మళ్లీ హర్రర్ జోనర్ లో సినిమా చేసే అవకాశం వుంది.

అయితే ఇది స్ట్రయిట్ సినిమానా, వెబ్ సిరీస్ నా అన్నది తెలియాల్సి వుంది. శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ ఓ ప్రాజెక్టు ప్లానింగ్ లో వున్నారు. నాగ్ చైతన్య హీరోగా దిల్ రాజు నిర్మించే సినిమా ఇది. ఈ సినిమా స్క్రిప్ట్ వ్యవహారం ఇంకా ఫుల్ గా పూర్తి కావాల్సి వుంది.

ఆ తరువాతనే ఈ హర్రర్ ప్రాజెక్ట్.  13 బి లాంటి సినిమా తరువాత గ్యాప్ ఇచ్చి చేయబోయే ఈ హర్రర్ పిక్ ఎలా వుంటుందో మరి?

పవన్ కళ్యాణ్ దగ్గర ఎప్పుడూ డబ్బులుండవు

మిమ్మల్ని యాంకర్ గా తీసెయ్యాలి