హిందీ రీమేక్ రెడీ.. తెలుగులో ఎప్పుడో?

విక్రమ్ వెథా.. తమిళ్ లో పెద్ద హిట్ అయిన సినిమా. యాక్షన్ సినిమాల్లోనే ఓ బెంచ్ మార్క్ గా నిలిచింది ఆ మూవీ. సినిమా టేకింగ్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, రియలిస్టిక్ డైలాగ్స్.. అన్నీ కొత్తగా…

విక్రమ్ వెథా.. తమిళ్ లో పెద్ద హిట్ అయిన సినిమా. యాక్షన్ సినిమాల్లోనే ఓ బెంచ్ మార్క్ గా నిలిచింది ఆ మూవీ. సినిమా టేకింగ్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, రియలిస్టిక్ డైలాగ్స్.. అన్నీ కొత్తగా ఉంటాయి ఆ సినిమాలో. అలాంటి సూపర్ హిట్ ను తెలుగులో రీమేక్ చేయాలనే ప్రయత్నాలు చాలానే జరిగాయి. కానీ అంతకంటే ముందే హిందీ రీమేక్ రెడీ అయింది.

అవును.. విక్రమ్ వెధా హిందీ రీమేక్ దాదాపు ఫిక్స్ అయింది. అమీర్ ఖాన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో ఈ రీమేక్ వచ్చే అవకాశం ఉంది. సినిమాలో మాధవన్ పాత్రలో అమీర్ ఖాన్, విజయ్ సేతుపతి పోషించిన పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. పుష్కర్-గాయత్రి దర్శకత్వంలో రాబోతోంది ఈ మూవీ. దిల్ చాహ్ తా హై సినిమా తర్వాత అమీర్-సైఫ్ కలిసి నటిస్తున్న మూవీ ఇదే.

నిజానికి హిందీ కంటే ముందుగా తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయాలని ప్రయత్నించారు. ఈ మేరకు చాన్నాళ్ల కిందటే చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. కానీ విజయ్ సేతుపతి పాత్ర పోషించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. వెంకటేష్, రవితేజ లాంటి హీరోలు మాధవన్ పాత్ర పోషించడానికి ఇష్టపడ్డారు కానీ, విజయ్ సేతుపతి రోల్ లో కనిపించడానికి ఎవ్వరూ దొరకలేదు.

ఒకదశలో విజయ్ సేతుపతినే తెలుగులో రీమేక్ లో కూడా కొనసాగించడానికి ప్రయత్నించారు కానీ అది కూడా సాధ్యంకాలేదు. దీంతో తెలుగు రీమేక్ అలా మరుగున పడిపోయింది. 

తెలుగుదేశం.. ‘నో ప్లాన్’ వారి గేమ్ ప్లాన్