కమల్ నటన, ఆలోచన రెండూ విభిన్నంగానే వుంటాయి. ఆయన సినిమా తెరపైకి పడేదాకా అందులో ఏముందో తెలియదు. కానీ కచ్చితంగా వైవిధ్యంగా వుంటుదని మాత్రం చెప్పచ్చు.
కమల్ నుంచి రాబోతున్న మరో సినిమా ఉత్తమ విలన్. ఈ సినిమా ట్రయిలర్ వచ్చింది. తమిళ ట్రయిలర్ అయినా కమల్ అభిమానులను బాగానే ఆకట్టుకుంది. ట్రయిలర్ చూస్తుంటే సినిమాలో విషయం విస్తృతి ఇంతా అంతా కాదన్నట్లు వుంది.
ప్రతిసారీ ఏదో ఒక కళను తన సినిమాల్లో చొప్పించినట్లే కథాకళి లేదా యక్షగానాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. దర్శకుడు రమేష్ అరవింద్ కన్నడిగ కాబట్టి, అక్కడ ప్రాచుర్యమైన యక్షగానం కావచ్చు.
మొత్తానికి ట్రయిలర్ లో దర్ళకుడు బాలచందర్ ను నిజజీవిత పాత్రలోనే చూపించినట్లు కనిపించింది. అతని దగ్గరకు కథ చెప్పడానికి కమల్ వచ్చినట్లు చూపించారు. సినిమా తీయడానికి ఎక్కువ టైమ్ లేదని డైలాగ్ కూడా వుంది. దీన్ని బట్టి సినిమాలో సినిమా అంటూ కాస్త వైవిధ్యమైన కథనే ఎంచుకున్నట్లుంది కమల్ ఈసారి కూడా.