విమర్శలకి వెరవని వైట్ల

'ఆగడు', 'బ్రూస్‌లీ' చిత్రాలతో శ్రీను వైట్ల స్టార్‌డమ్‌ మొత్తం హుష్‌కాకి అయిపోయింది. అంతవరకు రాజమౌళి, త్రివిక్రమ్‌ తర్వాత అతడే అన్నవాళ్లు వైట్లని లెక్కేయడం కూడా మానేసారు. ఇండస్ట్రీలో ఫేట్‌ ఎంత త్వరగా మారిపోతుందో, ప్లేస్‌…

'ఆగడు', 'బ్రూస్‌లీ' చిత్రాలతో శ్రీను వైట్ల స్టార్‌డమ్‌ మొత్తం హుష్‌కాకి అయిపోయింది. అంతవరకు రాజమౌళి, త్రివిక్రమ్‌ తర్వాత అతడే అన్నవాళ్లు వైట్లని లెక్కేయడం కూడా మానేసారు. ఇండస్ట్రీలో ఫేట్‌ ఎంత త్వరగా మారిపోతుందో, ప్లేస్‌ ఇంకెంత ఫాస్ట్‌గా చేజారిపోతుందో వైట్లని చూసి తెలుసుకోవచ్చు.

స్టార్‌ హీరోలు ముఖం చాటేయడంతో వైట్ల యువ హీరో వరుణ్‌ తేజ్‌తో మిస్టర్‌ తీసాడు. ఈ చిత్రం ట్రెయిలర్‌ చూస్తే నీరసంగా వుందని, జోష్‌ లేదని, చూడాలనే కోరిక కలగడం లేదని విమర్శలు వస్తున్నాయి. అయితే శ్రీను వైట్ల మాత్రం ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడు. 

ఇది తను రెగ్యులర్‌గా తీసే కమర్షియల్‌ సినిమాల్లాంటిది కాదని, ట్రెయిలర్‌ని ఎనర్జిటిక్‌గా ప్రెజెంట్‌ చేయడానికి ఇది పంచ్‌ డైలాగులు, యాక్షన్‌ సీన్లు వుండే సినిమా కాదని చెబుతున్నాడు. ఇదో ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ అని, ఎమోషన్స్‌ చాలా బాగుంటాయని, సినిమా మొత్తంగా చూస్తే కానీ ఆ అనుభూతి తెలీదని అంటున్నాడు. తన కెరీర్‌ ముందుకి సాగుతుందో లేక వైట్ల గ్లోరీ అయిపోయిందో డిసైడ్‌ చేసే మిస్టర్‌ వచ్చే శుక్రవారమే రిలీజ్‌ అవుతోంది.