మెగాభిమానులు, ఆ మాటకు వస్తే సాయి ధరమ్ తేజ్ అభిమానులు ఇప్పుడు దర్శకుడు వివి వినాయక్ పై మండిపడుతున్నారు. తమ హీరో కెరీర్ కిందకు తోసేసారని ఆరోపిస్తున్నారు. ఇదిలా వుండే ఇంటస్ట్రీలో వినాయక్ వైఖరిపై బోలెడు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన వ్యాపారాల్లో, రాజకీయాల్లో ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని, అందువల్లే సరైన ప్రొడక్ట్ ఆయన నుంచి రాలేదని టాక్ వినిపిస్తోంది.
వినాయక్ కు థియేటర్లు వున్నాయి. ఎంత మేనేజర్లు, స్టాఫ్ వున్నా, వాటి వ్యవహారాలు చూసుకుంటూ వుండాలి. అదీకాక రియల్ ఎస్టేట్ వ్యవహారాలు అన్నా, రాజకీయాల డిస్కషన్లు అన్నా వినాయక్ కు ఇష్టమని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. తరచు ఆయన ఇంట్లో ఈ తరహా డిస్కషన్లు జరుగుతూ వుంటాయని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
ఇలా రాజకీయాలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, థియేటర్లు వంటి పనుల ఒత్తిడి వినాయక్ పనితీరుపై ప్రభావం చూపిప్తోందని, లేదంటే ఆయన ఇప్పటికీ మంచి ప్రొడక్ట్ ఇవ్వగలరని ఆయన అభిమానులు అంటున్నారు. మంచి కథకులను, కథలను, వినాయక్ దగ్గరకు చేరకుండా కొందరు అడ్డం పడుతున్నారన్న వదంతులు కూడా వున్నాయి.
వినాయక్ కొట్టి పారేసినా, తెలుగుదేశం ఆయన దక్షిణ కోస్తాలోనూ, వైకాపా పార్టీ ఆయన రాజమండ్రిలోనూ ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది నిజం. ఇది వినాయక్ సన్నిహిత వర్గాల బోగట్టానే. కానీ వినాయక్ కు అయితే మొన్నటి దాకా మరి కొన్ని సినిమాలు చేసి, 2024టైమ్ లో అప్పటి పరిస్థితులను బట్టి డెసిషన్ తీసుకోవాలని వుండేది.
కానీ ఇప్పుడు వినాయక్ కెరీర్ కాస్త డోలాయమానంలో పడిన మాట వాస్తవం. ఎందుకంటే ఆయన పేరు యాడ్ అయినా సాయి ధరమ్ తేజ్ సినిమాకు సరైన ఓపెనింగ్స్ దక్కలేదు. ఆ మ్యాజిక్ ఏమయింది అన్నిది ఇండస్ట్రీ వర్గాలకు, మెగాభిమానులకు అంతు పట్టడం లేదు. అందువల్ల మరోసారి 2019నాటికి ఎన్నికల బరిలోకి దిగే విషయమై వినాయక్ ఆలోచన చేస్తారేమో? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.