సమ్మర్ లో విడుదల విషయంలో బన్నీ నాపేరు సూర్యకు సమస్యలు వస్తున్నాయి ఆది నుంచీ. రంగస్థలం విషయంలో చరణ్ అండ్ బన్నీ ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చారు. మార్చి నెలాఖరులో చరణ్, ఏఫ్రియల్ నెలాఖరులో బన్నీ ఫిక్సయ్యారు. మహేష్ బాబు ఎలాగూ తన ‘భరత్ అనే నేను’ సినిమాను జూన్ కు తీసుకెళ్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సమస్య కేవలం రజనీకాంత్ రోబో 2.0 సినిమాతోనే అనుకున్నారు ఇన్నాళ్లు.
అయితే రోబో 2.0 టెక్నికల్ అవుట్ పుట్ తో దర్శకుడు శంకర్ అంత హ్యాపీగా లేరని వార్తలు వినవచ్చాయి. అందువల్ల ఆ సినిమా పెద్దగా అడ్డం పడకపోవచ్చని ఇన్నాళ్లు ధీమాగా వున్నారు. కానీ ఇప్పుడు పోటీ వేరే రూపంలో వచ్చి మీద పడింది. రజనీకాంత్ మరో సినిమా కాలా విడుదల డేట్ వచ్చింది. ఏప్రియల్ 27విడుదల అంటూ ఇప్పుడు ప్రకటించారు.
రోబో 2.0తో పోల్చుకుంటే కాలా సినిమా తెలుగునాట అంత ప్రభావం చూపే సినిమా కాకపోవచ్చు. పైగా కాలా సినిమాను తెలుగులో కొనే నిర్మాతను బట్టి అది ఇచ్చే పోటీ ఆధారపడి వుంటుంది. కాలా సినిమా గతంలో వచ్చిన నాయకుడు సినిమాను పోలి వుంటుంది.
తమిళనాడు నుంచి ముంబాయ్ చేరుకుని, అక్కడ పేదల నాయకుడిగా ఎదిగిన హీరో కథ అది. అందుచేత అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కు అవకాశం వుంటుంది. అయితే డైరక్టర్ రంజిత్ ది కమర్షియల్ పార్మాట్ కాదు. అదో డిఫరెంట్ స్టయిల్. అది మన ప్రేక్షకులకు అంతగా నచ్చుతుందా అన్నది అనుమానం. ఏమైనా కాస్త పోటీ అయితే వుంటుంది.
మరి ఇప్పుడు బన్నీ క్యాంప్ ఏం చేస్తుందో చూడాలి. బన్నీ సినిమా వుండగా, దాని వెనుక అరవింద్ వుండగా, తెలుగులో ఎవరు కాలా సినిమాను కొని పోటీగా విడుదల చేస్తారో చూడాలి.