వినాయక్ పరిస్థితి ఏమిటి?

ఎన్టీఆర్ వినియన్న అని ముద్దుగా పిలుచుకునే భారీ సినిమాల డైరక్టర్ వివి వినాయక్. . తీసిన సినిమాలు డజనుకు ఒక్కటి ఎక్కువగా అయినా టాప్ డైరక్టర్స్ జాబితాలో చేరిపోయారు. కానీ గడచిన మూడు నాలుగేళ్లుగా…

ఎన్టీఆర్ వినియన్న అని ముద్దుగా పిలుచుకునే భారీ సినిమాల డైరక్టర్ వివి వినాయక్. . తీసిన సినిమాలు డజనుకు ఒక్కటి ఎక్కువగా అయినా టాప్ డైరక్టర్స్ జాబితాలో చేరిపోయారు. కానీ గడచిన మూడు నాలుగేళ్లుగా ఆయన కెరియర్ నత్తనడక నడుస్తోంది. బద్రీనాథ్ వరకు ఏడాదికో సినిమా ఇచ్చిన ఆయనకు అదే సినిమా బ్రేకేసింది. మేకింగ్ కు సమయం తీసుకుంది..తరువాత మరో సినిమా రావడానికి సమయం పట్టింది. 

మొత్తానికి ఏదో విధంగా నాయక్ సినిమా వచ్చింది. హిట్ కొట్టాననిపించుకున్నాడు. కానీ మళ్లీ సినిమా రాలేదు. ఆఖరికి నిర్మాత బెల్లంకొండ ఆబ్లిగేషన్ తో అల్లుడు శీను చేయాల్సి వచ్చింది. పబ్లిసిటీ వ్యవహారం పక్కనపెడితే అందులో వినాయక్ కనబర్చిన అద్భుత ప్రతిభ అయితే ఏమీ లేదని సినిమా జనం పెదవి విరిచారు. ఆ సినిమా విడుదలై రెండు నెలలు కావస్తోంది. కానీ మళ్లీ ఇప్పటికి సినిమా ప్రకటన ఏదీ రాలేదు వినాయక్ నుంచి. 

ఒక టాప్ డైరక్టర్ ఇలా ఖాళీగావుండడం అంటే కాస్త ఆశ్చర్యమే. ఎందుకంటే వినాయక్ డైరక్ట్ చేస్తానంటే హీరోలు నో అనేవారు వుండరు. కానీ మరి ఎందుకు ఇలా జరగుతోంది అన్నది తెలియదు. వినాయక్ ఎంచుకుని చేస్తున్నారా? లేదా నిర్మాతలు వినాయక్ దగ్గరకు రావడం లేదా? హీరోలు అడగడం లేదా? ఇప్పుడు అర్జెంట్ గా హిట్ కావాల్సిన ఎన్టీఆర్ అయినా అడిగి ఓ సినిమా చేయంచుకోవచ్చుగా..వినాయక్ స్టామినా జనాలకు తెలిసేలా?