తమిళంలో విడుదలై సంచలనాలు నమోదు చేసుకున్న సినిమా విఐపి. వెళ్లై ఇల్లా పట్టాదారి అన్నది పూర్తి పేరు. ధనుష్, అమలాపాల్ నటించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఇది ధనుష్ కు 25వ సినిమా . పైగా స్వంత సినిమా. ఇప్పుడు ఈ సినిమా హక్కులను తెలుగులో స్రవంతి సంస్థ తీసుకుంది. ఈ సంస్థ హీరో రామ్ హోమ్ బ్యానర్ అన్న సంగతి తెలిసిందే.
Advertisement
ఈ సినిమా హక్కుల కోసం తెలుగు, తమిళ, మలయాళం నిర్మాతలు ఎగబడ్డారు. తెలుగు హక్కులు రవికిషోర్ కు దక్కాయి. అంతకు ముందు నుంచే ఈ సినిమా రామ్ కు, నితిన్ కు సూటవుతుందన్న వార్తలు వినవచ్చాయి. ఇప్పుడు స్రవంతి దగ్గరకు హక్కులు చేరడంతో రామ్ చేయడానికే ఎక్కువ అవకాశాలు వున్నాయి.