రేవంత్..కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో

ఎవరిపైనన్నా చెలరేగిపొమ్మంటే, ముందు వెనుక చూడకుండా రెచ్చిపోవడంలో రేవంత్ రెడ్డి తరువాతే ఎవరైనా? అందునా జగన్ అన్నా కేసిఆర్ అన్నా ఆయన ఒంటి కాలిపై లేచిపోతారు. ఆ లేవడంలో కిందా మీదా ఏముందన్నది చూసుకోరు…

ఎవరిపైనన్నా చెలరేగిపొమ్మంటే, ముందు వెనుక చూడకుండా రెచ్చిపోవడంలో రేవంత్ రెడ్డి తరువాతే ఎవరైనా? అందునా జగన్ అన్నా కేసిఆర్ అన్నా ఆయన ఒంటి కాలిపై లేచిపోతారు. ఆ లేవడంలో కిందా మీదా ఏముందన్నది చూసుకోరు కూడా. మెదక్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇప్పుడు మరోసారి అలాగే రెచ్చిపోయారు. అచ్చంగా రేవంత్ మాటల్లో చెప్పాలంటే, కెసిఆర్ వలసవాదులను ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడి నుంచో తెచ్చి మెదక్ లో పోటీకి నిలిపారు. ఇది చాలా అన్యాయం..అక్రమం..అరాచకం. 

నిజమే..అది ముమ్మాటికీ నిజమే. స్థానికులను కాదని, ఎక్కడి నుంచో తెచ్చి పోటీకి నిలపడం ముమ్మాటికీ రాజకీయపార్టీ నేతగా కెసిఆర్ చేసిన మహాపరాథం. దాన్ని ముమ్మాటికీ క్షమించకూడదు..

సరే. బాగానే వుంది. కానీ రేవంత్ గారి పార్టీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏం చేస్తున్నారయ్యా? గడచిన మూడు దఫాలుగా ఆయన వలసవాదులను ప్రోత్సహిస్తూనే వస్తున్నారుగా. గతం సంగతి ఎందుకు ఇటీవల ఎన్నికల్లో ఎన్నిచోట్ల ఆయన ఎక్కడివారిని ఎక్కడికో తీసుకెళ్లి టికెట్ లు ఇవ్వలేదు. ఆ జాబితా చేతికిస్తే, రేవంత్ మరోసారి తన గొంతు సవరించుకుని బాబుపై విరుచుకు పడగలరా? ఆ ధైర్యం వుందా? 

కాదు, అసలు వలసవాదులకు టిక్కెట్లు ఎక్కడిచ్చారు అంటారా? కావాలంటే విశాఖ జిల్లా వెళ్లి చూడండి..ఎక్కడెక్కడ ఎలా చేసారో తెలుస్తుంది. అంతెదుకు బాలకృష్ణ ఏమన్నా అనంతపురం లోకలా? కోడెల ప్లేస్ మార్చలేదా? 

గతంలో ఏమో కానీ రేవంత్ కెసిఆర్ పాలసీలను విమర్శించే ముందు బాబు వైఖరి ఓసారి చూసకుని చేయడం మంచిది.లేదంటే విమర్శలు బూమరాంగ్ అయ్యే ప్రమాదం వుంది.

చాణక్య

[email protected]