రభస సినిమా కొత్త రకం రికార్డు నెల కొల్పింది. పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా, హిట్ అయినా, ఫట్ అయినా పోస్టు పబ్లిసిటీ అన్నది కామన్. ప్రీ పబ్లిసిటీ వేరు, ఈ పోస్ట్ పబ్లిసిటీ వేరు. సినిమా ఇంత బాగుంది అంత బాగుంది. ఇంత కలెక్షన్లు వచ్చాయి..అంత కలెక్షన్లు వచ్చాయి. అంటూ ప్రకటనలు చేయడం, సక్సెస్ మీట్ లు పెట్టి ముఖాల మీదకు నవ్వులు తెచ్చుకుని, స్పీచులు దంచడం వంటివి చేస్తారు.
పెద్ద సినిమాలు కనుక ఏవరేజ్ టాక్ వచ్చినా, సాయంత్రానికో,. మర్నాడు ఉదయానికో సక్సెస్ మీట్ అంటారు. ఇంకా మాట్లాడితే టూర్ అంటారు. కానీ చిత్రంగా రభస సినిమాకు ఇవేమీ లేవు. విడుదలైన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్క ప్రెస్ మీట్ కానీ, నోట్ కానీ, హడావుడికానీ, టీవీ ఇంటర్వూలు కానీ ఏమీ లేవు. సమంత ప్రెస్ మీట్ అని చెప్పి అదీ క్యాన్సిల్ చేసారు.
రభస సినిమాకు విడుదల ముందూ ప్రచారం వీక్ అని అందరికీ తెలిసిందే,. విడుదల తరువాత కూడా ఇంత వీక్ కావడం మరీ ఘొరం. అదీ ఓ రకమైన రికార్డే.