మారుతి దానయ్య వివాదం పరిష్కారమైంది. ముందు యు వి క్రియేషన్స్ తో సినిమా చేసి, తరువాత దానయ్య తో చేయాలని సినిమా పెద్దలు పరిష్కారం చేసారు. అంతవరకు బాగానే వుంది. కానీ ఇప్పుడు హీరో ఎవరు అన్నది కొత్త సమస్య. నానితో చేయడమా. ..అంతకన్నా పెద్ద హీరో ఎవరితోనన్నా చేయడమా అన్నది యువి వారి సందిగ్ధం.
మారుతి తన లైన్ తో రెడీగా వున్నాడు. అతగాడికి ఎవరైనా ఓకె. కానీ డబ్బులు పెట్టే నిర్మాతకు ఓపెనింగ్స్, కలెక్షన్లు అంటూ లెక్కలు తప్పవు కదా. అందుకే హీరోగా నాని…అవును..కాదు..అని నాన్చుతున్నారు. అది తేలితే కానీ మారుతి తాజా సినిమా పట్టాల కెక్కదు. చిన్న సినిమాలు చేసినపుడే నయం, మారుతి చకచక బండి వెనుక బండి లాగించారు. ఇప్పుడు రేంజ్ పెరిగితే అన్నీ ఇబ్బందులే.