టాలీవుడ్ లో ఏషియన్ సునీల్ అంటే తెలియని వారు లేరు. ఆయన తండ్రి నుంచి తెలంగాణలో చేయని సినిమా వ్యాపారం లేదు. థియేటర్లు, మాల్స్, మల్టీ ఫ్లెక్స్ లు, సినిమాల పంపిణీ, ఫుడ్ కోర్టులు ఇలా ఎన్ని వ్యాపారాలో. ఏఎమ్ బి మల్టీ ఫ్లెక్స్ లో సగం వాటా ఆయనదే. తెలంగాణ లో దాదాపు వంద లీజు థియేటర్లు. వీటిలో సురేష్ బాబు కూడా భాగస్వామి. అది వేరే సంగతి.
అలాంటి కింగ్ పిన్, కోట్లకు పడగలెత్తిన ఏషియన్ సునీల్ నుంచి ఇటు ఆంధ్రకు కానీ, అటు తెలంగాణకు కానీ పైసా విరాళం లేదు. పోనీ ఆంధ్ర సిఎమ్ కు ఇవ్వడం ఇష్టం లేదు అనుకుంటే, సిసిసి అనేది ఒకటి స్టార్ట్ చేసారు కదా? దానికయినా ఇవ్వాలి. అదీ లేదు.
దీని మీద టాలీవుడ్ లో అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి. హీరోలు ఇవ్వలేదు అని రాస్తారు. కోట్లకు పడగలెత్తిన సునీల్ లాంటి వాళ్లు ఇవ్వకుంటే ప్రశ్నించరేం అంటూ అడుగుతున్నారు. తెలంగాణ చాంబర్ అంటూ అందరి తరపున ఏదో ఇచ్చేసాం అనిపించేసి ఊరుకున్నారు. మరి ఆయన వ్యాపారాల తరపున రూపాయి విదల్చలేదేం అని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా వుంటే థియేటర్లకు మినిమమ్ కరెంట్ బిల్లు అనేది వుంటుంది. థియేటర్ నడచినా , నడవకుున్నా ముఫై వేల నుంచి లక్ష రూపాయల వరకు కరెంట్ బిల్లు కట్టాల్సిందే. సునీల్ సంస్థకు దాదాపు వందకు పైగా థియేటర్లు అయితేనేం, మల్టీ ఫ్లెక్స్ లు అయితేనేం వున్నాయి. ఇవన్నీ కలిసి నెలకు కోటికి పైగా కరెంట్ బిల్లులు చెల్లించాలి. ఇఫ్పడు ఈ బిల్లుల్లో రాయతీ ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరతారట.
రూపాయి విరాళం ఇవ్వకపోయినా, ప్రభుత్వాలు తిరిగి రివర్స్ లో రాయతీలు ఇస్తాయా? ఏమో ఇస్తాయేమో?