ఇది ఓ నెత్తుటి ప్రేమకథ

అత్యంత సహజంగా సినిమాలు తీస్తాడనే పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు వేణు ఉడుగుల. మొదటి సినిమాతోనే అది ప్రూవ్ అయింది. ఇప్పుడీ దర్శకుడు విరాటపర్వం అనే మూవీ తీస్తున్నాడు. కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో, మీడియాలో నలుగుతున్న…

అత్యంత సహజంగా సినిమాలు తీస్తాడనే పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు వేణు ఉడుగుల. మొదటి సినిమాతోనే అది ప్రూవ్ అయింది. ఇప్పుడీ దర్శకుడు విరాటపర్వం అనే మూవీ తీస్తున్నాడు. కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో, మీడియాలో నలుగుతున్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు ప్రారంభమైంది. ఇప్పుడీ స్టోరీలైన్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా రాబోతున్న ఈ సినిమా 1980ల నాటి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అంతేకాదు.. సినిమాలో రానా ఓ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. ఓ దళానికి నాయకత్వం వహిస్తూ, సాయుధ పోరాటం చేస్తుంటాడు. ఇతడి జీవితాన్ని రీసెర్చ్ చేసే జర్నలిస్ట్ పాత్రలో సాయిపల్లవి కనిపించనుంది. ఆమెకు ఈ సినిమాలో మేకప్ ఉండదు.

విరాటపర్వం సినిమా కథనం మొత్తం చాలా కొత్తగా ఉండబోతోంది. నెరేషన్ మొత్తం సాయిపల్లవి కోణంలోనే నడుస్తోంది. ఆమె రీసెర్చ్ ప్రారంభించడం, రానాతో ప్రేమలో పడడం లాంటి వ్యవహారాలన్నీ చాలా సహజంగా ఉండబోతున్నాయి. హీరోయిన్ ప్రేమను అంగీకరించిన రానా నక్సలిజాన్ని వదిలేసి, జనజీవన స్రవంతిలో కలుస్తాడా? లేక సాయిపల్లవినే తన భావజాలం వైపు లాక్కొస్తాడా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది.

వచ్చేవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలువుకానుంది. సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు అంతా తానై వ్యవహరించబోతున్నాడు దర్శకుడు వేణు. కథ, కథనం నుంచి టెక్నీషియన్స్ ఎంపిక వరకు అన్నీ తను అనుకున్నట్టే చేస్తున్నాడు. ఈ విషయంలో డైరక్టర్ కు సురేష్ బాబు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టున్నాడు.

ఇలాంటి డ్రామాలు టీడీపీకి కొత్తేం కాదు సుమా!