Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆర్-ఆర్-ఆర్.. ఆ తేదీకి రావడంలేదు!

ఆర్-ఆర్-ఆర్.. ఆ తేదీకి రావడంలేదు!

సాధారణంగా ప్రత్యేకమైన రోజులు వచ్చినప్పుడు సినిమా ప్రమోషన్లు ఊపందుకుంటాయి. ఏదో ఒక పోస్టర్ లేదా సాంగ్ రిలీజ్ చేస్తుంటారు. అలాగే ఆగస్ట్ 15కి ఆర్-ఆర్-ఆర్ మూవీ నుంచి ఏదైనా లుక్ వస్తుందని అంతా ఊహించారు. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. తన సినిమాకు సంబంధించి ఆగస్ట్ 15న ఎలాంటి స్టిల్ రిలీజ్ చేయడం లేదని స్వయంగా రాజమౌళి ప్రకటించాడు.

ఆర్-ఆర్-ఆర్ సినిమాలో కొమరం భీమ్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. స్వతంత్ర ఉద్యమంనాటి కథ ఇది. కాబట్టి పంద్రాగస్టు లాంటి అకేషన్ ను రాజమౌళి టీమ్ మిస్ చేసుకోదని అంతా ఆశించారు. కానీ రాజమౌళి మాత్రం అలాంటిదేం లేదని స్పష్టంచేశాడు.

తన సినిమాకు సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంటాడు రాజమౌళి. ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేయాలి, గెటప్స్ ఎప్పుడు బయటపెట్టాలి, టీజర్ ఎప్పుడు వదలాలి లాంటి అంశాలపై చాలా పక్కాగా ఉంటాడు. ఆర్-ఆర్-ఆర్ విడుదల తేదీకి చాలా టైమ్ ఉంది. అందుకే ఫస్ట్ లుక్ రిలీజ్ లాంటి పనులు పెట్టుకోలేదు రాజమౌళి.

వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. అంటే ఇంకా ఏడాది కంటే ఎక్కువ టైమ్ ఉంది. పైగా ఇప్పుడు రాజమౌళి పూర్తిగా షూటింగ్ పైనే దృష్టిపెట్టాడు. అందుకే ఫస్ట్ లుక్ లాంటి ప్రమోషన్స్ కు ప్రస్తుతానికి దూరంగా ఉన్నాడు.

ఇలాంటి డ్రామాలు టీడీపీకి కొత్తేం కాదు సుమా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?