పార్టీల ఊపు లేకపోతే ఏ రాజకీయ కుటుంబం కూడా తొడలుకొట్టే పరిస్థితి లేదు అనే విశ్లేషణ ఇప్పుడు ఏపీకి చక్కగా సెట్ అవుతుంది. గట్టిగా వీచిన జగన్ గాలిలో మహామహా రాజకీయ కుటుంబాలు రాజకీయంగా చిత్తు అయ్యాయి. కోట్ల, జేసీ, పరిటాల వంటి వాళ్లు తమ తమ నియోజకవర్గాల పరిధిలో చిత్తు అయిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం వారి వెంటే ఉన్నా నెగ్గుకు రాలేకపోయారు. అలాంటి కోవకే చెందుతుంది భూమా కుటుంబం కూడా!
వీళ్ల వ్యక్తిగత బలం, పార్టీ బలం.. ఇవేవీ వీళ్లను కనీసం ఒక నియోజకవర్గం పరిధిలో గెలిపించలేకపోయాయి. దీంతో అపరిమితమైన 'అహం' చూపిన వారికి ఇప్పుడు వాస్తవం అర్థం అవుతోందని ప్రజలు అనుకుంటున్నారు. ఆ ధోరణిలో వ్యవహరించిన వారిలో అఖిలప్రియ కూడా ఒకరని సీమలో బాగా చర్చ జరుగుతూ ఉంది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి అఖిలప్రియ తెలుగుదేశం నేతగా చాలా అహాన్నే చూపించారు. చంద్రబాబు నాయుడే తమను ఉద్ధరించింది అన్నట్టుగా ఈమె మాట్లాడారు. ఈమె జగన్‌ను ఉద్ధేశించి పెద్దగా విమర్శలు చేయలేదు కానీ, కనీస కతజ్ఞత చూపలేదు.. అనే భావనే ఎక్కువగా వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అఖిల అన్నను నమ్ముకుంటున్నట్టుగా ఉంది.
'జగనన్నా..' అంటున్నారీమె. ఫలితాలు వచ్చిన రోజే ట్వీట్లో 'జగనన్న'గా సంబోధించి తన తదుపరి పయనం గురించి క్లూ ఇచ్చారీమె. అన్ని నియోజకవర్గాల్లో జగన్ మోహన్‌రెడ్డే పోటీ చేసినట్టుగా ప్రజలు తీర్పునిచ్చారని అఖిల అభిప్రాయపడింది. అలా జగన్‌పై చాలా విధేయతనే చూపింది. ఇక విజయమ్మ ద్వారా అఖిలప్రియ సెంటిమెంట్‌ను ప్రయోగిస్తోందని, తిరిగి వైఎస్సార్సీపీలో చేరే ప్రయత్నంలో ఉందని వినికిడి!
ఇలాంటి డ్రామాలు టీడీపీకి కొత్తేం కాదు సుమా!